Drunk and Drive: న్యూఇయర్ రోజు మందుబాబుల హంగామా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌‌లో ఎంతమందో పట్టబడ్డారో తెలుసా..?

అటు న్యూ ఇయర్‌ జోష్‌ నడుస్తుంటే.. ఇటు పోలీసులు మాత్రం తమ డ్యూటీ తాము చేసుకుంటూపోయారు. హైదరాబాద్‌లో విస్తృత్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు.

Drunk and Drive: న్యూఇయర్ రోజు మందుబాబుల హంగామా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌‌లో ఎంతమందో పట్టబడ్డారో తెలుసా..?
Drunk And Drive
Follow us

|

Updated on: Jan 01, 2022 | 9:12 AM

New Year Drunk and Drive: అటు న్యూ ఇయర్‌ జోష్‌ నడుస్తుంటే.. ఇటు పోలీసులు మాత్రం తమ డ్యూటీ తాము చేసుకుంటూపోయారు. హైదరాబాద్‌లో విస్తృత్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు, జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు.40 బైక్‌లు, ఏడు కార్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని ముందస్తుగానే హెచ్చరించింది. తాగి వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అయినప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు.

ఇక అటు కేబీఆర్ పార్క్ సమీపంలో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా ఓ యువతి హంగామా సృష్టించింది. అటు పోలీసులతో పాటు తోటి ప్రయాణికులను దుర్భాషలాడుతూ అర్థరాత్రి రెచ్చిపోయింది. దీంతో యువతిని అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు జూబ్లీహిల్స్‌ పోలీసులతో మందుబాబులు వాగ్వివాదానికి దిగారు. పోలీసు వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఇటు రాజేంద్రనగర్‌లో డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం తాగి 92 మంది వాహనదారులు దొరికారు. 92 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దాదాపుగా 40 కేసులు నమోదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అటు, కర్నూలు జిల్లా కోడుమూరు లో రోడ్ల పైన పోలీసులు ఉన్నారని కంపచెట్ల లో మద్యం తాగి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకున్నారు యువకులు.

ఇదిలావుంటే, ఆంక్షల నడుమ న్యూ ఇయర్ వేడుకలు జరిగినా పోలీసులు పబ్ లెస్ విషయంలో ఖచ్చితమైన రూల్స్ పాటించారు. అయితే, జనావాసాల మధ్య ఉన్న పబ్ ల విషయంలో మరింత ఖచ్చితంగా ఉన్నారు. గొడవలు, న్యూసెన్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు పబ్ లాడే అని చెప్పిన జనావాసాల మధ్య ఉన్న పబ్ ల తీరు మాత్రం మారలేదు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని TOT పబ్ ముందు మధ్యరాత్రి ఒంటి గంట తర్వాత నానా హంగామా సృష్టించారు. తాగి రోడ్లమీద యువతీ యువకులు నానా బీభత్సం చేశారు. రోడ్ల మీదే మూత్ర విసర్జన, తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన అమ్మాయిలు అక్కడే చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో పాటు తాగిన మైకంలో విపరీతంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. దీనిపై కాలనీ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read Also….  Top 9 News: తెలుగు రాష్ట్రాల ట్రెండింగ్ వార్తలు.. పొలిటికల్ న్యూస్ సమాహారం “టాప్ 9 న్యూస్” (వీడియో)