Jharkhand Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. వ్యాన్‌ టక్కు ఢీకొని ఆరుగురు కూలీలు మృతి, 18 మందికి గాయాలు

న్యూ ఇయర్‌ వేళ రోడ్లు రక్తమోడుతున్నాయి. జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.

Jharkhand Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. వ్యాన్‌ టక్కు ఢీకొని ఆరుగురు కూలీలు మృతి, 18 మందికి గాయాలు
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 01, 2022 | 10:41 AM

Jharkhand Road Accident: న్యూ ఇయర్‌ వేళ రోడ్లు రక్తమోడుతున్నాయి. జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో 18మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన పలాజు జిల్లాలోని హరిహర్ గంజ్ వద్ద చోటుచేసుకుంది.

జార్ఖండ్‌‌కు పొరుగు రాష్ట్రమైన బీహార్‌లోని హరిహరగంజ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వరి కోసిన తర్వాత వారి గ్రామానికి వెళ్తున్న కూలీలతో నిండిన పికప్‌ వ్యాన్‌ను పెద్ద ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పికప్‌లో ఉన్న ముగ్గురు బాలికలతో సహా ఆరుగురు మృతి చెందారు. జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లా మానిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్వయ్య పాట్నా గ్రామానికి చెందిన 31 మంది కార్మికులు ఓబ్రాలోని సిహుడి గ్రామంలో వరి కోయడానికి వస్తున్నారు. వరి కోతలు ముగియడంతో కూలీలంతా పికప్‌ వ్యాన్‌లో స్వగ్రామానికి బయలుదేరారు. హరిహరగంజ్ సమీపంలోకి కారు రాగానే సడన్ బ్రేక్ వేయడంతో కూలీలంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. దీంతో వారిపై నుంచి వెనుక నుంచి వచ్చిన ట్రక్కు వెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికులు గాయపడిన వారందరినీ హరిహరగంజ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ముగ్గురు బాలికలతో సహా ఆరుగురు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయపడిన 28 మంది హరిహరగంజ్‌లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన పంకి, మాణిక్, లతేహర్, బార్వయ్యలు పాట్నా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మరణించినవారిని పోస్టుమార్టం నిమిత్తం సదరు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బాలికలను నీలం, బసంతి, అర్పణగా గుర్తించినట్లు బంధువులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో చనిపోయినవారి మృతదేహాలను సదర్ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా లతేహర్ జిల్లా మానికా పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్వయ్య పాట్నా గ్రామ నివాసితులు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న నగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also… China Robots: ఆర్మీ విషయంలో డ్రాగన్ కంట్రీ(కంత్రీ) బిల్డప్ బట్టబయలు.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు!