వీడిన మిస్టరీ..తిట్టినందుకే బాలుడి హత్య!

రెండు రోజులుగా మిస్టరీగా ఉన్న కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో ఎనిమిదేళ్ల బాలుడు దారుణ హత్యపై సస్పెన్స్ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది తోటి విద్యార్థే కావడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. 15 ఏళ్ల బాలుడు.. కిరాయి గుండాల మాదిరి కత్తితో గొంతుకోసి చప్పిన విషయం తెలుసుకోని పోలీసులు నిర్ఘాంతపోయారు. వివరాల్లోకి వెళ్తే..చల్లపల్లిలోని నారాయణరావునగర్‌కు చెందిన బాలుడు దాసరి ఆదిత్య(8) సోమవారం రాత్రి హాస్టల్ బాత్రూమ్‌లో హత్యకు గురయ్యాడు. తెల్లవారాక ఆదిత్య కనిపించకపోవడంతో […]

వీడిన మిస్టరీ..తిట్టినందుకే బాలుడి హత్య!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 07, 2019 | 5:24 PM

రెండు రోజులుగా మిస్టరీగా ఉన్న కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో ఎనిమిదేళ్ల బాలుడు దారుణ హత్యపై సస్పెన్స్ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది తోటి విద్యార్థే కావడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. 15 ఏళ్ల బాలుడు.. కిరాయి గుండాల మాదిరి కత్తితో గొంతుకోసి చప్పిన విషయం తెలుసుకోని పోలీసులు నిర్ఘాంతపోయారు.

వివరాల్లోకి వెళ్తే..చల్లపల్లిలోని నారాయణరావునగర్‌కు చెందిన బాలుడు దాసరి ఆదిత్య(8) సోమవారం రాత్రి హాస్టల్ బాత్రూమ్‌లో హత్యకు గురయ్యాడు. తెల్లవారాక ఆదిత్య కనిపించకపోవడంతో గాలించగా.. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో విగతజీవిగా గుర్తించారు. మెడపైన లోతైన కత్తిగాయం ఉంది. ఎవరో కిరాతకంగా హత్యచేసినట్లు భావించారు. వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు చివరకు మర్డర్ మిస్టరీని చేధించారు. చనిపోయిన బాలుడితో పాటు రూమ్‌లో ఉండే 10వ తరగతి విద్యార్థినే నిందితుడిగా తేల్చారు.

సోమవారం ఆడుకుంటున్న సమయంలో ఆదిత్యతో పదో తరగతి విద్యార్థికి వాగ్వాదం జరిగింది. అది గొడవకు దారితీసింది. ఇది చూసిన వార్డెన్.. ఇద్దరినీ మందలించాడు. మనసులో పగ పెంచుకున్న సదరు పదో తరగతి విద్యార్థి… అదే రోజు రాత్రి ఆదిత్యను స్నానాల గదికి తీసుకెళ్లాడు. పెన్సిల్ చెక్కే బ్లేడుతో గొంతు కోసి చంపేశాడు. అనంతరం రక్తపు మరకలు అంటుకున్న తన దుస్తులను పెట్టెలో దాచి ఏమీ తెలియనట్లు పడుకుండిపోయాడు. ఈ కారణంగానే.. హంతకుడు ఎవరన్నదీ పోలీసులు వెంటనే గుర్తించలేకపోయారు. నిందితుడి నుంచి పెన్సిళ్లు చెక్కే చాకు స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య మృతదేహాన్ని శవపరీక్ష కోసం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించి, ఆదిత్య కుటుంబానికి పరిహారం ఇప్పించాలని ఆందోళనకు దిగారు.