రేప్ చేయబోయిన వ్యక్తి… మరెప్పుడు అలాంటి పని చేయకుండా తగిన శాస్తి చేసిన మహిళ

తనపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఆగంతకుడికి తగిన శాస్తి చేసింది మహిళ. ఏకంగా అతడి...

రేప్ చేయబోయిన వ్యక్తి... మరెప్పుడు అలాంటి పని చేయకుండా తగిన శాస్తి చేసిన మహిళ
Mp Woman Cuts Off Mans genitals

Updated on: Mar 20, 2021 | 2:08 PM

తనపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఆగంతకుడికి తగిన శాస్తి చేసింది మహిళ. ఏకంగా అతడి మర్మాంగాన్ని కోసేసి.. తన  శీలాన్ని, ప్రాణాన్ని కాపాడుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… గురువారం అర్థరాత్రి సమయంలో  ఓ మహిళ (45) భర్త పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. దీంతో ఆమె తన 13 ఏళ్ల కుమారుడితో ఇంట్లో ఉంది. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళను కొట్టి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దాదాపు అరగంటపాటు ఉన్నాదితో పోరాడింది సదరు మహిళ. దుండగుడు ఎంతకీ విడవకపోవడంతో.. తనను తాను కాపాడుకునే క్రమంలో అందుబాటులో ఉన్న కొడవలి తీసుకుని నిందితుడి మర్మాంగాన్ని కోసేసింది. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి రాత్రి 1.30 గంటలకు ఫిర్యాదు చేసింది.

నిందితుడిని ప్రాథమిక చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్లు ఖాదీ ప్రాంత ఎస్సై ధర్మేంద్ర సింగ్ రాజ్​పుత్. అనంతరం సిధి జిల్లా ఆస్పత్రికి, వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం సంజయ్ గాంధీ బోధనాసుపత్రికి మార్చినట్లు వెల్లడించారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. అయితే, నిందితుడు సైతం మహిళపై ఫిర్యాదు చేశాడని పోలీసులు వెల్లడించారు. దీంతో మహిళపై ఐపీసీ సెక్షన్ 327 ప్రకారం కేసు నమోదు అయిందని వివరించారు.  కాగా మహిళ తగిన శాస్తి చేసిందని.. స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై ఉన్మాదులు దాడులు చేయకుండా ఆ మాత్రం భయం ఉండాలని చెబుతున్నారు.

Also Read: ‘ఆ అమ్మాయి నాది’ అని బెదిరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు.. ఆగిపోయిన పెళ్లి.. కట్ చేస్తే.. వన్‌ సైడ్‌ లవ్‌ అట

  పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. భలే ప్లాన్ చేశారుగా..!