కుక్క మిస్సింగ్.. పోలీసులకు ఫిర్యాదు

తన పుడు కుక్క తప్పి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న సీజర్..

కుక్క మిస్సింగ్.. పోలీసులకు ఫిర్యాదు

తన పుడు కుక్క తప్పి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న సీజర్ (కుక్క పిల్ల) కనిపించడంలేదని కుషాయిగూడు పోలీసులకు కంప్లైంట్​ చేశాడు.

మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎస్ఐఐసీ పంచవటి కాలనీలో నివసిస్తున్న ఆనంద్ అనే వ్యక్తి ఈ కంప్లైట్ ఇచ్చాడు. ఈ నెల 13వ తేదీ రాత్రి నుండి తన పెంపుడు కుక్క కనిపించటం లేదని, కుక్క పిల్ల ఫొటో పోలీసులకు ఇచ్చి వెతికిపెట్టమని ఆనంద్ తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు మిస్సింగ్​ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.