మంజీరా నది ప్రవాహంలో చిక్కుకున్న జాలర్లు

మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని కొల్చారం మండలం హనుమాన్ బండల వద్ద మంజీరానదిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు బండరాళ్లపై నిలబడి ఉన్నారు.

మంజీరా నది ప్రవాహంలో చిక్కుకున్న జాలర్లు
Follow us

|

Updated on: Oct 21, 2020 | 5:34 PM

మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని కొల్చారం మండలం హనుమాన్ బండల వద్ద మంజీరానదిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు బండరాళ్లపై నిలబడి ఉన్నారు. నిన్న సాయంత్రానికి మంజీరా వరద ఉధృతి తగ్గడంతో నలుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అయితే సింగూరు నుంచి నీరు వదలడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొల్చారం మండలం కిష్టాపూర్ మెదక్ పట్టణానికి చెందిన నలుగురు మత్స్యకారులు మంజీరా నది ప్రవాహం మధ్యలో చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ, పోలీస్ అధికారులు హనుమాన్‌బండల వద్దకు చేరుకున్నారు. మెదక్ సీఐ…బాధితులతో ఫోన్లో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. బాధితుల్ని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు సహాయచర్యలు చేపట్టారు. వారికి కావాల్సిన ఆహారం మంచినీళ్లు అందజేసే ప్రయత్నం చేశారు.