పెడన ఎమ్మెల్యే ఇంటిలో భారీ చోరీ.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో రంగంలోకి దిగిన పోలీసులు

కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగల కలకలం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్థరాత్రి..

పెడన ఎమ్మెల్యే ఇంటిలో భారీ చోరీ.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో రంగంలోకి దిగిన పోలీసులు
Follow us

|

Updated on: Feb 09, 2021 | 1:44 PM

కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగల కలకలం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్థరాత్రి చోరీ జరిగినట్లు చెబుతున్నారు. ఈ దొంగతనంలో మొత్తం 18లక్షల రూపాయలు మాయమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రమేష్ ఇంటి తాళాలు పగలగొట్టి.. కారం చిమ్మి లోపలికి ప్రవేశించారని సమాచారం.

బెడ్రూమ్‌లో బీరువా లాకు పగలగొట్టిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పెడన పట్టణంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు జరుగుతోంది. ఎమ్మెల్యే ఇంట్లో చోరీ జరగడంతో అటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. చోరీ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేరు. దీంతో పోలీసులు చుట్టుపక్కలవారిని, ఇంట్లో పని చేసేవారిని విచారిస్తున్నారు.

ఇది దొంగల పనా లేక తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే ఇంట్లోనే చోరీ జరిగితే సామాన్య జనం పరిస్థితేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే నివాసంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ సేకరిస్తున్నారు.

Read more:

అన్న మీద కోపం ఉంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలి గానీ ఇక్కడేం పని..? బీజేపీ ఆడిస్తున్న నాటకంలా కనిపిస్తుందన్న వీహెచ్‌

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు