Maoist Attacks in Chhattisgarh: దేశంలో మావోయిస్టుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట దండకారణ్యం నెత్తురోడుతూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఓ ఎస్సైను హతమార్చారు. బీజాపూర్ జిల్లాలో ఎస్సైని మురళి తాతిని మావోయిస్టులు కాల్చి చంపారు. బుధవారం సెలవుపై ఇంటికి వెళ్లిన గంగలూరు పీఎస్ ఎస్ఐ మురళి తాతిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అనంతరం శనివారం ఉదయం హతమార్చి మృతదేహాన్ని పుల్సుంపుర దగ్గర పడేసి వెళ్లిపోయారు. కాగా.. మృతదేహం వద్ద బస్తర్ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ లభ్యమైంది. కుటుంబ సభ్యులు ఆయన విడుదల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. కాగా మురళి తాతి 2018లో జగదల్‌పూర్‌లో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన బీజాపూర్‌లో పనిచేశారు. చర్చలు జరుగుతాయనుకున్న సమయంలోనే ఇలాంటి దాడులు జరుగుతుండటంతో దండకారణ్యమంతటా ఆందోళన నెలకొంది.
• అక్టోబర్ 27, 2018 ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెళ్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందారు.
• జులై 27,2020 ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ లోని దూల్ ఛత్తీస్‌గడ్ ఆర్మడ్ ఫోర్స్‌పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో జవాను మృతి చెందాడు.
• సెప్టెంబర్ 5,2020 బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. వారిలో నలుగురిని గొంతుకోసి హతమార్చారు.
• అక్టోబర్ 25,2020 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నాయకులపు ఈశ్వర్ అనే హోంగార్డును మావోయిస్టులు కొట్టి చంపారు.
• అక్టోబర్ 1,2020 ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇన్‌ఫార్మర్ల నెపంతో కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్యక్తులను మావోయిస్టులు హతమార్చారు.
• అక్టోబర్11,2020 ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత భీమేశ్వరరావు ( బీసు) ను మావోయిస్టులు చంపారు.
• డిసెంబర్ 17,2020 ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా మతిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంగ్రిగూడా గ్రామంలో రహదారి పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను మావోయిస్టులు హతమార్చారు.
• ఏప్రిల్ 5,2021 చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో విజయనగరం జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను రౌతు జగదీష్ మృతి.
• మార్చి 23,2021 ఛత్తీస్ గఢ్ నారాయాణపూర్ జిల్లాలో డీఆర్‌జీ సిబ్బందితో వెళుతున్న బస్సును పేల్చివేసిన మావోయిస్టులు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు.
• ఏప్రిల్ 4, 2021 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా-బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందారు.
• ఏప్రిల్ 16, 2021 సుక్మా జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లను కత్తితో పీక కోసి మావోయిస్టులు హత్యచేశారు.
• ఏప్రిల్ 17, 2021 ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో రోడ్డు నిర్మాణ పనుల్లో సూపర్ వైజర్‌ను కొట్టి దారుణంగా చంపారు. ముగ్గురిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఒకరిని హతమార్చారు.
• ఏప్రిల్ 19, 2021 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకులను మావోయిస్టులు హత్య చేశారు.
• ఏప్రిల్ 24, 2021 బీజాపూర్ జిల్లా లో ఎస్సై మురళిని మావోయిస్టులు హతమార్చారు.
Also Read: