ATM Robbery: కష్టపడకూడదు కానీ డబ్బులు సంపాదించాలి.. ఇదీ ప్రస్తుతం సమాజంలో కనిపిస్తోన్న తీరు. ఈ క్రమంలోనే కొందరు ప్రబుద్ధులు ఈజీ మనీకోసం అడ్డ దారులు తొక్కుతున్నారు. దొంగతనాలకు ఏటీఎంలను అడ్డగా మార్చుకుంటున్నారు. సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎమ్‌లే లక్ష్యంగా దొంగతనాలకు దిగుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలకు అడపాదడపా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏకంగా గడ్డపారతో ప్రవేశించిన ఓ ప్రబుద్ధుడు ఏటీఎంను బద్ధలు కొట్టడానికి విశ్వప్రయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో ఉన్న ఓ ఏటీఎంలోకి ఓ వ్యక్తి గడ్డపారతో ప్రవేశించాడు. ఏటీఎంను ధ్వంసం చేసే క్రమంలోనే విఫల ప్రయత్నం చేశాడు. తీరా ఎంతకీ పని వర్కవుట్ కాకపోవడంతో సైలెంట్‌గా వినుతిరిగాడు. అయితే దొంగతనానికి ప్రయత్నించిన విధానం మొత్తం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. మరి ఏటీఎంను పగలగొట్టడానికి ఈ దొంగ చేసిన ప్రయత్నాన్ని మీరు ఓ సారి చూడండి.
Iraq: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ఆర్తనాదాలు.. కరోనా చికిత్స పొందుతోన్న 50 మంది అగ్నికి ఆహుతి.!