భార్యపై కోపంతో ఇద్దరు కొడుకులను చంపి భర్త ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాపురానికి రానన్నందుకు భార్యపై కోపంతో ఇద్దరు కుమారులను హతమార్చాడు ఓ కిరాతకుడు.

భార్యపై కోపంతో ఇద్దరు కొడుకులను చంపి భర్త ఆత్మహత్య
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2020 | 11:02 AM

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాపురానికి రానన్నందుకు భార్యపై కోపంతో ఇద్దరు కుమారులను హతమార్చాడు ఓ కిరాతకుడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బాలాఘాట్‌లో చోటు చేసుకుంది. కచ్చార్టోలా గ్రామానికి చెందిన భురాసింగ్‌ పునం(27) భార్యతోపాటు ముగ్గురు కుమారులతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరుచు గొడవ జరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన భార్య.. కుమారులను తీసుకొని సోన్పురిలోని పుట్టింటికి వెళ్లింది.

అయితే, భార్యను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చేందుకు పునం అత్తింటికి వెళ్లి ఒప్పించే ప్రయత్నం చేశాడు. భర్తతో తిరిగి వచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన పునం భార్య ఇంట్లో లేని సమయంలో కుమారులు సమీర్ (6), కైలాష్ (4) గొంతు పిసికి హతమార్చాడు. చిన్న కుమారుడు ఆకాశ్‌(1) సైతం చంపేందుకు యత్నిస్తుండగా బంధువులు గుర్తించడంతో పారిపోయి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బాలాఘాట్ ఎస్పీ అభిషేక్ తివారీ తెలిపారు. పోలీసులకు చిన్నారి ఆకాశ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పుసం మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు పోలీసులు.