బొల్లినేని గాంధీ చుట్టూ బిగుస్తున్న సీబీఐ ఉచ్చు

ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి దొరికిపోయాడు. గతంలో శ్రీనివాసగాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయ్యింది.

బొల్లినేని గాంధీ చుట్టూ బిగుస్తున్న సీబీఐ ఉచ్చు
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 11:44 AM

ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి దొరికిపోయాడు. గతంలో శ్రీనివాసగాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయ్యింది. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేసింది. ఈ కేసులో భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో బొల్లినేని సూపరింటెండెంట్‌గా గతేడాది పనిచేశారు. ఈకేసును తారుమారు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. కాగా, మరో మహిళా అధికారి సుధారాణిపై కూడా కేసు నమోదయ్యింది.

భరణీ కమోడిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సత్యశ్రీధర్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదయ్యింది. ఇన్‌పుట్‌ క్రెడిట్‌ మంజూరు చేసేందుకు శ్రీనివాసగాంధీ రూ.5 కోట్లు లంచం డిమాండ్‌ చేశారు. బొల్లినేని ఈ మొత్తంలో రూ. 10 లక్షలు నగదు రూపంలో మిగతా సొమ్ము ఓపెన్‌ ప్లాట్‌, ఫ్లాట్‌ రూపంలో ఇవ్వాలని బొల్లినేని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ముగ్గురిపైనా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం విషయాలన్నింటినీ సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొంది.

ఇదిలావుంటే, గతేడాది జులైలో బొల్లినేని ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో బొల్లినేనిపై నివాసంతో పాటు, హైదరాబాద్, విజయవాడ తోపాటు పలుచోట్ల దాడులు నిర్వహించారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, మరోమారు లంచంకేసులో బొల్లినేనిని ఈడీ దర్యాప్తు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.