Srikakulam: ఏపీలో పట్టపగలు దారుణం.. వ్యక్తి దారుణ హత్య.. మరొకరి పరిస్థితి విషమం..

|

Mar 26, 2022 | 2:55 PM

Man brutally murder: ఏపీలోని శ్రీకాకుళం నగరంలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తిని ఘోరంగా చంపారు. మరొకరు ప్రాణపాయ స్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Srikakulam: ఏపీలో పట్టపగలు దారుణం.. వ్యక్తి దారుణ హత్య.. మరొకరి పరిస్థితి విషమం..
crime news
Follow us on

Man brutally murder: ఏపీలోని శ్రీకాకుళం నగరంలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తిని ఘోరంగా చంపారు. మరొకరు ప్రాణపాయ స్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని (Srikakulam) డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని గూనపాలాం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియన వ్యక్తులు గొడ్డలి, గన్, ఇనుప రాడ్లతో దాడి చేసారు. గూనపాలేనికి చెందిన దీర్గాశి కరుణ్ కుమార్ ఆయన దగ్గరి బంధువయిన దీర్గాశి హరీష్ కుమార్ ఇంటి బయట మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన దుండగులు గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డుతో దాడి చేసారు. ఈ దాడిలో దీర్గాశి కరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, హరీష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. హరీష్ మెడపై తీవ్ర గాయాలు కావటంతో పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన హరీష్ ను శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. మృతి చెందిన కరుణ్ కుమార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.. గాయపడిన హరీష్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దాడి అనతంరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల కారణంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ప్రత్యక్ష సాక్షి దుండగులు గన్ తో దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో పట్టణంలోని దమ్మలవీదికి చెందిన వారు కూడా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Viral Video: నా జోలికి వస్తే అంతే సంగతులు.. కుంగ్ ఫూ స్టంట్స్ చేసిన పాండా.. వీడియో వైరల్

AP Crime: డబ్బు కోసం రక్త సంబంధాన్ని మరిచాడు.. పూజారి హత్య కేసులో విస్తుపోయే విషయాలు