Cultivate Ganja: జై జవాన్, జై కిసాన్.. ఇది మన దేశం నినాదం… అయితే అందరికీ అన్నం పెట్టె అన్నదాత తాను గుప్పెడు మెతుకులు తినడానికి ఎంతో కష్టాలు పడతారు.. ఇక రైతుపై మనుషులే కాదు ప్రకృతి కూడా పగబడట్టిందా అనిపిస్తుంది ఒకొక్క సంఘటనను చూస్తుంటే.. ఆహార పంటలైన, వాణిజ్య పంటలైనా నిజమైన రైతు కష్టాల కడలిని ఈదుతున్నాడు. ఇక రైతు ఏ పంట పంట వేసినా నష్టమే మిగులుతుంది. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావణ లేదు. దీంతో కొంతమంది అన్నదాతలు తమ రూటు మార్చి పంటను డిఫరెంట్ గా పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు తాను అందరికీ భిన్నం అనుకున్నాడో.. లేక నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదు అని అనుకున్నాడో.. లేక ఎలాగైనా పంట కోసం పెడుతున్న పెట్టుబడిలో సగమైనా ఈ సారైనా సంప్రదించాలని భావించాడు. దీంతో రైతు తానూ పంట పండించడంలో పడుతున్న కష్ఠాలను తాము ఎదుర్కొంటున్న నష్టాలను వివరిస్తూ.. . గంజాయి పండిస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అంటూ ఏకంగా కలెక్టర్ కే లేఖ రాసి సంచలనం రేపాడు. ప్రస్తుతం ఈ లెటర్ సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని మోహోల్ తెహసిల్ కు చెందిన అనిల్ పాటిల్ నివాసం ఉంటాడు. రైతు అనిల్ పాటిల్ కలెక్టర్ కు లేఖ రాశాడు. ఏ పంట పండించినా పంటకు మార్కెట్ లో సరైన ధర ఉండడం లేదు. కనీసం పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఏ పంటకూ స్థిరమైన ధర లేదు. అయితే మార్కెట్‌లో గంజాయికి మాత్రం మంచి డిమాండ్ ఉంది. అందుకే నాకున్న రెండు ఎకరాల భూమిలో గంజాయి సాగు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నానని ఆ రైతు చెప్పారు.
ఐటీ ఈ లెటర్ లో కలెక్టర్ నిర్ణయం తీసుకోవడానికి కండిషన్స్ అప్లై అని కూడా అన్నాడు. తన లేఖ చదివి సెప్టెంబర్ 15లోపు తనకు రిప్లయ్ ఇవ్వాలని డెడ్‌లైన్ కూడా పెట్టాడు. 15 లోపు ఏ విషయం స్పందించకపోతే.. 16వ తేదీ నుంచి గంజాయి సాగు మొదలు పెడతానని ప్రభుత్వానికి హెచ్చరిక జరీ చేశాడు. అంతేకాదు.. తాను గంజాయి పెంచడం మొదలు పెట్టిన అనంతరం ఎవరైనా తనను నేరస్థుడు అని అంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అల్టిమేటం జరీ చేశారు.
ప్రస్తుతం ఈ రైతు రాసిన ఈ గంజాయి లేఖ ప్రసుతం చర్చనీయాంశం అయింది. ఈ లెటర్ ను కలెక్టర్ మోహోల్ పోలీసు స్టేషన్‌కు పంపారు. ఈ లేఖపై మోహోల్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ స్పందించారు. రైతు లేఖ ఒక పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేశారు. అంతేకాదు, ఒకవేళ గంజాయి సాగు చేస్తే ఎవరైనా చర్యలు తప్పవని.అతని పై తగిన చర్యలు తీసుకోనున్నామని తెలిపారు.
Also Read: 2వేల కోట్లతో మంత్రాలయంలో అభివృద్ధి పనులు.. గంగా నదిలా తుంగభద్రని శుభ్రం చేస్తామంటూ…