Hyderabad: ప్రాణం తీసిన అతివేగం.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం..

|

Feb 26, 2022 | 11:45 AM

SI Dead in Road Accident: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్‌లో లారీని కారు ఢీకొన్ని ఘటనలో ఎస్ఐ దుర్మరణం చెందారు.

Hyderabad: ప్రాణం తీసిన అతివేగం.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం..
Road Accident
Follow us on

SI Dead in Road Accident: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్‌లో లారీని కారు ఢీకొన్ని ఘటనలో ఎస్ఐ దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి లారీని కారు అతివేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ఎస్‌ఐ పల్లె రాఘవేందర్‌ గౌడ్‌ (palle raghavender goud) అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జీఆర్పీలో రాఘవేందర్‌ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో రాఘవేందర్ గౌడ్ సికింద్రాబాద్‌ జీఆర్‌పీలో ఎస్‌ఐగా పని చేశారు. ఇటీవల ఆయన బదిలీపై మహబూబ్‌నగర్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. రాఘవేందర్‌గౌడ్‌ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

అతివేగంతోనే ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఓఆర్ఆర్‌పై అర్ధరాత్రి 2.15 సమయంలో వేగంగా వెళ్తున్న కారు.. సిమెంట్ లోడ్ లారీని ఢికొట్టింది. శంషాబాద్ నుంచి తుక్కుగుడా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పహాడి షరీఫ్ పోలీసులు వెల్లడించారు. దీంతో రాఘవేందర్‌గౌడ్‌ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Also Read:

Viral Video: వామ్మో! ఎరను వేటాడేందుకు ఈ పాము ఏం చేస్తోందో చూస్తే ఫ్యూజులు ఔట్ కావాల్సిందే..!

Viral Video: ఈ మొసలి మహాముదురు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!

Telangana: ఆమె అటవీ శాఖలో సీనియర్​ అసిస్టెంట్.. టైపిస్ట్‌తో రూమ్‌లో.. భర్త ఏం చేశాడంటే..?