Viral Video: వామ్మో! ఎరను వేటాడేందుకు ఈ పాము ఏం చేస్తోందో చూస్తే ఫ్యూజులు ఔట్..!
Sand Viper Viral Video: ప్రమాదకర పాములు సాధారణంగా ప్రతీచోట కనిపిస్తుంటాయి. వాటిని దూరంగా చూస్తేనే మనం భయంతో గజగజ వణికిపోతుంటాం.. ఇంకా దగ్గరగా చూస్తే ఆ భయాన్ని మనం మాటల్లో చెప్పలేం.
Sand Viper Viral Video: ప్రమాదకర పాములు సాధారణంగా ప్రతీచోట కనిపిస్తుంటాయి. వాటిని దూరంగా చూస్తేనే మనం భయంతో గజగజ వణికిపోతుంటాం.. ఇంకా దగ్గరగా చూస్తే ఆ భయాన్ని మనం మాటల్లో చెప్పలేం. అయితే.. పాముల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని జాతులు అడవులలో కనిపిస్తాయి. మరికొన్ని నీళ్లల్లో, ఇసుక ప్రాంతాలలో కనిపిస్తాయి. ప్రతి పాము.. తనని తాను రక్షించుకోవడానికి, ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి దాని సొంత మార్గం ఉంటుంది. ఇక సొంతమార్గం అంటూ లేని పరిస్థితుల్లో ఎదురుదాడి చేయడమో.. లేక పరిగెత్తడమో చేస్తుంది. తాజాగా.. నెట్టింట (Social Media) ఓ పాముకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ పాము ఇసుకలో దాక్కొని మరి వేటాడుతుంది. అయితే.. 33 సెకన్లు ఉన్న ఈ వీడియోలో పాము ఇసుకలో దాక్కుంటుంది. ఇది చూస్తే అక్కడ పాము ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే క్షణాల్లోనే ఇసుకలో మాయమైంది.
వైరల్ అవుతున్న వీడియోలో పాము మొదట ఇసుకపైన కనిపిస్తుంది. అప్పుడు అది ఇసుకపై పాకడం కనిపిస్తుంది. అలా ఇసుకను నెమ్మదిగా కదిలిస్తూ.. మాయమవుతుంది. తోకను శరీరాన్ని కదిలిస్తూ ఈ పాము క్షణాల్లోనే అది ఇసుక కింద దాక్కుంటుంది. అయితే.. ఆశ్చర్యం ఏమిటంటే.. ఇసుక కింద పాము ఉన్నట్లు మనం కూడా గుర్తుపట్టలేం.
వైరల్ వీడియో..
This is how a sand viper conceals itself to ambush prey.
Credit: Javier Aznar https://t.co/LXe7AuWDBu pic.twitter.com/jt9mCooSZv
— Amazing Nature (@AmazingNature00) February 3, 2022
ఇలాంటి సమయాల్లో.. పొరపాటున అటు వెళ్లినా.. దానిని గుర్తించక కాలు పెట్టినా పాము కాటుకు బలికావాల్సిందే. ఈ వైరల్ వీడియో అమెజింగ్ నేచర్ అనే యూజర్ ట్విట్లర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షకు పైగా మంది వీక్షించారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ సాండ్ వైపర్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: