Crime News: భార్య ముక్కు కొరికిన భర్త..  భరణం ఇవ్వాలన్నందుకు అత్తారింటికి వెళ్లి..

|

Sep 27, 2021 | 12:50 PM

Family Disputes: తాళి కట్టిన భార్యపై భర్త అమానుషంగా ప్రవర్తించాడు. క్షణికావేశంలో ఆమె ముక్కును తీవ్రంగా కొరికాడు. దీంతో విలవిలలాడుతున్న

Crime News: భార్య ముక్కు కొరికిన భర్త..  భరణం ఇవ్వాలన్నందుకు అత్తారింటికి వెళ్లి..
Crime News
Follow us on

Family Disputes: తాళి కట్టిన భార్యపై భర్త అమానుషంగా ప్రవర్తించాడు. క్షణికావేశంలో ఆమె ముక్కును తీవ్రంగా కొరికాడు. దీంతో విలవిలలాడుతున్న ఆ మహిళను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లం జిల్లా అలోట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ వివాదాల కారణంగా భర్త కోపంతో భార్య ముక్కు కొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆలోట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నీరజ్ సర్వన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉజ్జయినికి చెందిన దినేష్, టీనా దంపతులకు 2008లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తకు ఉద్యోగం లేకపోవడంతో మద్యం తాగుతూ తనను ఇబ్బందులకు గురిచేసేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. వివాహం అనంతరం కొన్నేళ్లకు భర్త వేధింపులు తట్టుకోలేక టీనా తన కుమార్తెలతో కలిసి పుట్టింటికి వెళ్లి నివాసముంటుంది. అక్కడే పనిచేసుకుంటూ పిల్లలను చూసుకుంటోంది. ఈ క్రమంలో 2019 లో ఆమె తన భర్త నుంచి భరణం కావాలని కోర్టులో కేసు వేసింది.

ఈ క్రమంలో దినేశ్.. ఇటీవల టీనా ఇంటికెళ్లి దీనిపై ఆమె తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో కోపంతో ఉన్న దినేష్ తన కుమార్తెల ఎదుట టీనాపై దాడి చేసి, పళ్లతో ఆమె ముక్కును కొరికాడు. దీంతో ముక్కుపై గాయాలై తీవ్ర రక్తస్రావం అయింది. అనంతరం దినేష్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోందని.. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అలోట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నీరజ్ సర్వన్ తెలిపారు.

Also Read:

AB PM-JAY: దేశ ప్రజల ఆరోగ్యభద్రతే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. అది ఎలా పనిచేస్తుందంటే..

Rainy Season Tips: వర్షం కురుస్తున్నప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే..