AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. 9 ఏళ్ల దత్తపుత్రికపై దంపతుల చిత్ర హింసలు.. ప్రైవేటు భాగాలపై కాలిన గాయాలు!

దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. మానవత్వం మంటగలిసిపోతోంది. సొంత పిల్లలనే హింసలకు గురి చేస్తున్న ఘననలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణం..

దారుణం.. 9 ఏళ్ల దత్తపుత్రికపై దంపతుల చిత్ర హింసలు.. ప్రైవేటు భాగాలపై కాలిన గాయాలు!
Subhash Goud
|

Updated on: Jul 27, 2022 | 11:10 AM

Share

దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. మానవత్వం మంటగలిసిపోతోంది. సొంత పిల్లలనే హింసలకు గురి చేస్తున్న ఘననలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇండోర్‌ జిల్లాలో ఒక జంట తమ 9 ఏళ్ల దత్తపుత్రికను చిత్రహింసలకు గురి చేసింది. ఈ బాలిక కాళ్లకు వాతలతో హింసకు గురి చేశారు. ఈ విషయమై పోలీసులకు తెలియడంతో ఈ దంపతులను అరెస్టు చేశారు. మంచాన్ని నీటితో తడిపినందున తన ప్రైవేటు భాగాలపై చిత్ర హింసలకు గురి చేశారని ఆమె ఆరోపించింది. సదరు పెంచుకుంటున్న తండ్రి కూడా బాలికపై దారుణంగా దాడి చేసినట్ఉల ఎంఐజీ పోలీసులు తెలిపారు. నిందితులై దంపతులకు బాలికకు దగ్గరి బంధుత్వం ఉంది. పీటీఐలోని నివేదిక ప్రకారం.. సదరు బాలిక తల్లిదండ్రులు కోవిడ్‌ కారణంగా మరణించారు. దీంతో దగ్గరి బంధుత్వం ఉన్న దంపతులు బాలికను దత్తత తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, పోలీసులు నిందితులపై సెక్షన్‌ 294, 323, 324, 326-A, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిని కోర్టులో హాజరు పర్చిన అనంతరం జ్యుడీషియల్‌ కస్టడికి పంపినట్లు పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జీ అజయ్‌ వర్మ తెలిపారు. ప్రస్తుతానికి బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసిన తర్వాత మంచి కుటుంబం దత్తత తీసుకునేలా చూస్తామని అధికారులు తెలిపారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటి (CWC) చైర్‌పర్సన్‌ పల్లవి పోర్వాల్‌ కూడా బాలిక ప్రైవేటు భాగాలపై కాలిన గాయాలున్నట్లు ధృవీకరించారు. ఆమె తలపై కొన్ని వెంట్రుకలు కాలినట్లు గుర్తించారు. అలాగే బాలిక శరీరంపై చేతి వేళ్ల గుర్తులను గుర్తించినట్లు చెప్పారు. బాలికను ఇంత చిత్రహిసలకు గురిచేసిన వారికి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. బాలికకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు