AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గన్ తో నుదుటిపై కాల్చుకుని లాయర్ సూసైడ్.. పెద్ద శబ్ధం రావడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాగ్ లింగంపల్లిలో లాయర్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. కడపకు (Kadapa) చెందిన న్యాయవాది శివారెడ్డి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైసెన్స్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి...

Hyderabad: గన్ తో నుదుటిపై కాల్చుకుని లాయర్ సూసైడ్.. పెద్ద శబ్ధం రావడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు
Gun
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 23, 2022 | 6:39 AM

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాగ్ లింగంపల్లిలో లాయర్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. కడపకు (Kadapa) చెందిన న్యాయవాది శివారెడ్డి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైసెన్స్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి పెద్దశబ్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివారెడ్డి అపార్ట్స్‌మెంట్స్‌లోకి మూడో అంతస్తులో ఉంటున్నారు. ఈయన ఎయిర్‌ఫోర్స్ నుంచి సార్జెంట్‌గా రిటైర్‌ అయ్యారు. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తన భార్య నుంచి విడాకులు తీసుకున్న శివారెడ్డి ఒంటరిగా ఉంటున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు కడప నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) వచ్చిన శివారెడ్డి కింద షాపులో టీ తాగిన తర్వాత తన పోర్షన్‌లోకి వెళ్లి లోపలి నుంచి లాక్‌ చేసుకున్నారు. ఆయన సోదరి మహేశ్వరి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో ఆమెను అనుమానం వచ్చింది. ఆమె కవాడిగూడలో ఉంటున్న తన స్నేహితురాలు లక్ష్మి భవానికి ఫోన్ చేసి తన అన్న దగ్గరకు వెళ్లాలని సూచించింది.

దీంతో బాగ్‌లింగంపల్లి వచ్చిన ఆమెకు ఈ షాకింగ్‌ విషయం తెలిసింది. లక్ష్మి భవాని తన తల్లితో కలిసి వాచ్‌మెన్ దుర్గాప్రసాద్ సహాయంతో తలుపు గడియ పగులగొట్టి లోపలికి వెళ్లింది. బెడ్‌పై శివారెడ్డి శవమై కనిపించారు. అప్పటికే పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతూనే ఉన్నారు. క్లూస్ టీమ్, వేలిముద్రల బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాందీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి