AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

60లక్షలు ఇచ్చినా.. కాజల్‌ను కలవలేకపోయాడు

పెరుగుతున్న టెక్నాలజీతో మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, నగదు సంపాదన, లాటరీ, సినిమాలో ఛాన్స్ ఇలా పలు రకాలుగా వలలు విసిరి అమాయకులను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల రాజమౌళి *ఆర్ఆర్ఆర్‌@ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ ఒక న్యాయవాది వద్ద రూ.50లక్షలు తీసుకొని ఉడాయించిన విషయం మరువకముందే.. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. సినీ నటి కాజల్‌ను కలిపిస్తామంటూ ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.60లక్షలను వసూలు దోచేసిన కేటుగాళ్లు.. ఆ తరువాత […]

60లక్షలు ఇచ్చినా.. కాజల్‌ను కలవలేకపోయాడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 02, 2019 | 9:08 AM

Share

పెరుగుతున్న టెక్నాలజీతో మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, నగదు సంపాదన, లాటరీ, సినిమాలో ఛాన్స్ ఇలా పలు రకాలుగా వలలు విసిరి అమాయకులను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల రాజమౌళి *ఆర్ఆర్ఆర్‌@ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ ఒక న్యాయవాది వద్ద రూ.50లక్షలు తీసుకొని ఉడాయించిన విషయం మరువకముందే.. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. సినీ నటి కాజల్‌ను కలిపిస్తామంటూ ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.60లక్షలను వసూలు దోచేసిన కేటుగాళ్లు.. ఆ తరువాత అతడిని వేధించడం ప్రారంభించారు. దీంతో వేధింపులు తట్టుకోలేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురంకు చెందిన ఓ పారిశ్రామిక వేత్త కుమారుడు.. కొన్ని రోజుల క్రితం బ్రౌజింగ్‌ చేస్తుండగా.. కాజల్‌ను కలవాలనుకుంటే సదుపాయం కల్పిస్తామని పెట్టిన ప్రకటనను చూశాడు. దానికి తన పూర్తి వివరాలను నమోదు చేసుకున్న ఆ వ్యక్తి.. ముందుగా రూ.50వేలు చెల్లించాడు. అయితే ఆ తరువాత కొద్దిరోజుల్లోనే మాయగాళ్ల నుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. యువకుడి ఫొటోలను అసభ్యంగా సినీ నటులు, మహిళల పక్కనపెట్టి వాటిని అతడికి పంపించారు. విషయం తెలిస్తే తన పరువు పోతుందని భావించిన ఆ యువకుడు వాటిని తొలగించాలని సదరు వ్యక్తులను ఫోన్‌లో అడిగాడు. అడిగిన మొత్తం ఇస్తే చిత్రాలు ఎవరికీ పంపమని లేదంటే తల్లిదండ్రులకు, బంధువులకు పంపుతామని బెదిరించారు. ఇలా మూడు విడుతల్లో ఆ యువకుడి నుంచి రూ.60లక్షలు గుంజారు. ఆ తరువాత కూడా వేధింపులు ఎక్కువ అవ్వడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

మరోవైపు తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు అతడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు బాధితులు కోల్‌కతాలో ఉన్నాడని తెలుసుకొని పోలీసుల సాయంతో రక్షించారు. ఇక యువకుడు డబ్బులు పంపిన బ్యాంకు ఖాతా వివరాలు శివగంగై జిల్లా దేవకొట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్‌వి అని తెలుసుకొని విచారించారు. ఇక ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు శరవణ‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇందులో మరికొందరి హస్తముందన్న కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Follow Us