ICICI Mobile Banking: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల తీరు కూడా మారుపోతోంది. ఇప్పుడు అంతా హైటెక్ మోసాలు జరుగుతున్నాయి. మనకు తెలియకుండానే మన ఖాతాలోని డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవలి కాలంలో స్విమ్ స్వాపింగ్ అనే కొత్త దారిని ఎంచుకున్న సైబర్ కేటుగాళ్లు భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ స్విమ్ స్వాపింగ్ మోసంపై తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ అయిన ఐసీఐసీఐ. ముఖ్యంగా ఐసీఐసీ మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? అసలు సిమ్ స్వాపింగ్ అంటే ఏంటి? ఈ మోసం ఎలా జరుగుతుంది లాంటి వివరాలను ఖాతాదారులకు వివరించింది.
సైబర్ నేరస్థులు పలు రకాల మాల్వేర్ సహాయంతో మీ మొబైల్‌లోకి చోరబడుతున్నారు. అనంతరం మీ స్మార్ట్ ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ఖాతాలకు సంబంధించిన వివరాలతో పాటు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ సమాచారాన్ని తస్కరిస్తారు. ఇలా చేసిన తర్వాత.. మొబైల్ ఫోన్ పోయిందనో, సిమ్ కార్డ్ డ్యామేజ్ అయిందన్న కారణాన్ని చూపుతు టెలికాం సంస్థలకు దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకోసం ఖాతాదారుల ఫేక్ ఐడీను రూపొందిస్తున్నారు. ఇలా చేయగానే సదరు మొబైల్ యూజర్‌కు తెలియకుండానే అతని నెంబర్ డీ యాక్టివ్ అవుతుంది. ఈ సమయంలో డూప్లికేట్ సిమ్ కార్డు పొందిన సైబర్‌నేరగాళ్లు ఓటీపీ సహాయంతో మీ ఖాతాల్లోని సొమ్మును దర్జాగా కొట్టేస్తున్నారు. ఈ అక్రమాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి.
* ఒకవేళ మీ మొబైల్ నెంబర్‌కు చాలా కాలం నుంచి మెసేజ్‌లు కానీ ఫోన్‌కాల్స్ కానీ రాకపోయుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. మీ సిమ్ కార్డు యాక్టివ్‌లో ఉందో లేదో కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలుసుకోవాలి.
* స్విమ్ స్వాపింగ్ కోస దరఖాస్తు చేసుకోగానే కొన్ని టెలికాం కంపెనీలు ఎస్ఎమ్‌ఎస్ రూపంలో సందేశాన్ని పంపిస్తుంటాయి. ఇలాంటి వాటిని చూసిన వెంటనే అలర్ట్ అవ్వాలి.
* ఎప్పటికప్పుడు మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏవైనా అనుమానాదస్పద లావాదేవీలు జరిగి ఉంటే బ్యాంకు వారిని సంప్రదించాలి.
* తెలియని నెంబర్ల నుంచి పదే పదే కాల్స్ వస్తున్నాయన్న కారణంతోనో మరే కారణంతోనో ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ను ఎక్కువ కాలం స్విఛ్ ఆఫ్ చేయకూడదు. ఇలా చేస్తే సిమ్ స్వాపింగ్ జరుగుతున్న సమాచారం మీకు తెలిసే అవకాశం ఉండదు.
Stay vigilant and take the necessary steps by reporting this instance to your mobile network provider and by keeping a track of your network status.
Learn more here: https://t.co/DcftA5nn31
#SafeBanking #SIMSwapFraud #iPledgeSafeBanking pic.twitter.com/6qiFzQfYg9— ICICI Bank (@ICICIBank) July 4, 2021