లిక్కర్ అనగానే మనకు మద్యం బాటిల్లు, అందులోని రకాలు గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ కాసా మారింది.. బాటిల్‌లోనే కాదు.. ఇకపై ఆహార పదార్థంలోనూ మీకు మద్యం కనిపించవచ్చు. తాజాగా లిక్కర్ కలిపిన ఐస్‌క్రీమ్ బయటపడటం సంచలనంగా మారింది. కోయంబత్తూర్‌లో మద్యం కలిపిన ఐస్ క్రీం బయటపడింది. యువతని టార్గెట్ గా చేసుకుని మద్యం కలిపిన ఐస్‌క్రీమ్‌ని విక్రయిస్తున్నారు అక్కడి వ్యాపారస్థులు. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్‌ని సీజ్ చేశారు. కోయంబత్తూర్‌లోని అవినాశిపాలయంలో ఉన్న రోలింగ్ డఫ్ కేఫ్‌లో లిక్కర్ కలిపిన ఐస్‌క్రీమ్ విక్రయిస్తున్నట్టు తేలడంతో స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
రోలింగ్ డఫ్ కేఫ్‌లో ఐస్ క్రీమ్‌కి యువత ఫిదా కావడం.. ఐస్ క్రీమ్ తినడానికి జనం పోటీపడటంతో కొందరు స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రోలింగ్ డఫ్ కేఫ్‌లో తనిఖీలు చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి.
ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో హోటల్‌ని సీజ్ చేశారు అధికారులు. కోయంబత్తూరులోని ముఖ్యమైన కేఫ్‌లు, హోటళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు అధికారులు. ఎక్కడైనా ఆహార పదార్థాలు అనుమానాస్పదంగా కనిపిస్తే ఫిర్యాదు చేయాలని స్థానిక ప్రజలకు సూచించారు.
ఇవి కూడా చదవండి: PM Narendra Modi: ఇది భారతీయుల విజయం.. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైంది..