Ibrahimpatnam MPTC Husband Murder: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ భర్త దారుణ హత్యకు గురయ్యారు. మద్యం తాగిన ఓ వ్యక్తి ఎంపీటీసీ మమత భర్త పడల రాజారెడ్డి (42) ని హత్యచేశాడు. వివరాలు.. రాజారెడ్డి, రమేశ్ అనే వ్యక్తితో కలిసి నిన్న రాత్రి మద్యం తాగాడు. మద్యం తాగుతున్న క్రమంలో ఏదో ఒక విషయంపై ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవగా మారింది. మద్యం మత్తులో ఉన్న రమేశ్.. రాజారెడ్డిని రాయితో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో రాజారెడ్డి ఘటనా స్థలంలోనే మరణించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పలువురి నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: