Tragedy: అత్తా మామలను చూసేందుకు బయలుదేరిన కోడలు.. ఇంతలో వెంటాడిన మృత్యవు.

| Edited By: Balaraju Goud

Feb 10, 2024 | 10:04 PM

అధికారుల అలసత్వమో, మానవ తప్పిదమో, నిర్లక్ష్యమో.. ఏదైతేనేం.. ప్రతిరోజూ రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. రోడ్డు యాక్సిడెంట్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కుటుంబాలకు కుటుంబాలనే కకావికలం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా వాటి సంఖ్య తగ్గడం లేదు. వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణీకుల ప్రాణాలు తీస్తున్నాయి.

Tragedy: అత్తా మామలను చూసేందుకు బయలుదేరిన కోడలు.. ఇంతలో వెంటాడిన మృత్యవు.
Road Accident
Follow us on

అధికారుల అలసత్వమో, మానవ తప్పిదమో, నిర్లక్ష్యమో.. ఏదైతేనేం.. ప్రతిరోజూ రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. రోడ్డు యాక్సిడెంట్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కుటుంబాలకు కుటుంబాలనే కకావికలం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా వాటి సంఖ్య తగ్గడం లేదు. వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణీకుల ప్రాణాలు తీస్తున్నాయి. కుటుంబాల్లో తీరని శోఖాన్ని నింపుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలి తీసుకుంది.

నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సు లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రైవేట్‌ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అయితే ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన రూపా అనే మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అత్తాపూర్‌లో నివాసముంటున్న తన అత్తా మామలను చూసేందుకు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైంది. తన భర్త ఉద్యోగంలో బిజీగా ఉండడంతో హైదరాబాద్ కి వెళ్లి వస్తా అని చెప్పి బయలుదేరింది. అత్తమామ దగ్గరికి వెళ్లి వారి బాగోగులు చూసి రెండు రోజుల్లో తిరిగి వస్తానంటూ, ఇద్దరు పిల్లలను ఇంటి దగ్గరే వదిలిన రూపా, ఒక్కతే హైదరాబాద్ బయలుదేరింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే మృతి చెందింది ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…