Cannabis: హైదరాబాద్‌లో గంజాయి కోసం స్టూడెంట్స్ వెంపర్లాట… ఒక్క రాత్రే 100 మంది అదుపులోకి

|

Oct 06, 2021 | 6:22 PM

హైదరాబాద్‌లో గంజాయి అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. ఈ ఆపరేషన్ మరో వారం రోజులు కొనసాగుతుందన్నారు జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌.

Cannabis: హైదరాబాద్‌లో గంజాయి కోసం స్టూడెంట్స్ వెంపర్లాట... ఒక్క రాత్రే 100 మంది అదుపులోకి
Cannabis
Follow us on

హైదరాబాద్‌లో గంజాయి అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. నిన్న రాత్రి ఆపరేషన్లో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ మరో వారం రోజులు కొనసాగుతుందన్నారు జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌. గంజాయి కొనడానికి నిన్న రాత్రి వంద మంది వచ్చారని, వారికి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. దూల్ పేట్ నుంచి గంజాయి నిర్మూలించాలన్నదే తమ ప్రయత్నం అన్నారు సీపీ. బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మేవారిపై 33 FIR లు నమోదు చేశామన్నారు. ఒక్క నెలలో ఈ కేసులు పెట్టామన్నారు. గంజాయి కోసం వచ్చేవారిలో ఎక్కువ మంది విద్యార్ధులే ఉన్నారన్నారు. ఎండిపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు శ్రీనివాస్‌. గంజాయి అమ్మడమే కాదు.. కొనడానికి వచ్చినా నేరమే అన్నారు. తల్లి దండ్రుల ముందు నిన్న పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. రెండో సారి నేరం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

అంతర పంటగా గంజాయి సాగు

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నిషేధిత గంజాయి సాగు యధేచ్చగా సాగుతోంది. వివిధ పంటల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు.  పోలీసులు దాడులు చేస్తున్నా అక్రమార్కులు మాత్రం తమ దందా కొనసాగిస్తున్నారు. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్ర గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ నాయక్ తాండ శివారులోని రైతు తిరుపతి తన పత్తిపంటలో అంతర పంటగా గంజాయి సాగుచేస్తున్నాడు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు.  సుమారు 300 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఈ మేరకు కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తల్లిని క్రూరంగా సుత్తితో 14 సార్లు కొట్టి చంపాడు.. ఆపై తప్పించుకునేందుకు షాకింగ్ ప్లాన్