Crime News: ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులో మ‌రో ట్విస్ట్.. ఇత‌గాడు పక్కా స్కెచ్ వేశాడు.. కానీ

|

Jun 14, 2021 | 7:38 PM

ఆన్‌లైన్ లోన్‌యాప్ కేసులో మ‌రో ట్విస్ట్ వెలుగుచూసింది. బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి డబ్బులను తన అకౌంట్‌లోకి మళ్లించుకొన్న నకిలీ ఎస్ఐ... ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులో మ‌రో ట్విస్ట్.. ఇత‌గాడు పక్కా స్కెచ్ వేశాడు.. కానీ

Crime News: ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులో మ‌రో ట్విస్ట్.. ఇత‌గాడు పక్కా స్కెచ్ వేశాడు.. కానీ
Arrest
Follow us on

ఆన్‌లైన్ లోన్‌యాప్ కేసులో మ‌రో ట్విస్ట్ వెలుగుచూసింది. బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి డబ్బులను తన అకౌంట్‌లోకి మళ్లించుకొన్న నకిలీ ఎస్ఐ అనిల్‌ను తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ లోన్ యాప్స్ ద్వారా విదేశాలకు నిర్వాహకులు తరలించారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు 1100 బ్యాంకు అకౌంట్ల‌ను ఫ్రీజ్ చేశారు. అయితే ఈ బ్యాంకు ఖాతాలకు లేఖలు రాసి కోటిన్నర నగదును నకిలీ ఎస్ఐ అనిల్ తన అకౌంట్‌కు మళ్లించాడు. కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు ఫేక్ డాక్యుమెంట్లతో అనిల్ కుమార్ లేఖలను అందించారు. ఈ లేఖల ఆధారంగా ఈ బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్ చేసి అనిల్ ఖాతాలోకి ఐసీఐసీఐ మళ్లించింది.

ఇదే విధంగా గురుగ్రామ్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుకు లేఖ రాశాడు అనిల్. అయితే గురుగ్రామ్ బ్యాంకు అధికారులు హైదరాబాద్ ఐసీఐసీఐ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బ్యాంకు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహరంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జ‌ర‌ప‌గా.. నకిలీ ఎస్ఐ అనిల్ వ్యవహరం వెలుగు చూసింది. గుంటూరు జిల్లాకు చెందిన అనిల్ నకిలీ ఎస్ఐ అవతారమెత్తి ఈ డబ్బులను తన అకౌంట్ల‌కు మళ్లించుకొన్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. అనిల్ నుండి నకిలీ లెటర్ ప్యాడ్ లు,స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. లోతైన ద‌ర్యాప్తు కొన‌సాగుతుంది.

Also Read: జోక్ నచ్చ‌లేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి

కరోనాతో మరణించినవారి అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకునే విధానం ఇది