Gachibowli Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులతో సహా ముగ్గురు మృతి

|

Dec 18, 2021 | 11:17 AM

Junior Artists Died in Road Accident: హైదరాబాద్ మహానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెల్లిన కారు ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది.

Gachibowli Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులతో సహా ముగ్గురు మృతి
Road Accident
Follow us on

Hyderabad Road Accident: హైదరాబాద్ మహానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెల్లిన కారు ముగ్గురు వ్యక్తులను బలి తీసుకుంది. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో చెట్టును డీకొట్టింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

గచ్చిబౌలిలో జరిగిన ప్రమాదంలో తుక్కుతుక్కైంది. కారు రెండు ముక్కలైంది. అంటే కారు స్పీడ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వెనుక భాగం, ముందు భాగం.. కారు రెండు భాగాలుగా విడిపోయింది. చెట్టును ఢీకొనడంతో.. ఆ చెట్టు కూడా డ్యామేజ్ అయ్యింది. అక్కడి దృశ్యాలను చూస్తే కారు ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనకు అర్థం అవుతుంది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్. మానస, కర్నాటకకు చెందిన N.మానసతో పాటు విజయవాడకు చెందిన బ్యాంక్‌ ఉద్యోగి అబ్దుల్‌ రహీం యాక్సిడెంట్‌ స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు.

మద్యం తాగి బండి నడపకండిరా అంటే అర్థం కావడం లేదు. అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగడం, ఆపై రోడ్డెక్కడం. ఈ క్రమంలో గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హెచ్‌సీయూ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న M.మానస(22), N.మానస(21), మరో వ్యక్తి అబ్దుల్ రహీంలు ప్రాణాలు కోల్పోయారు. తాగి బండి నడిపిన కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఉదయం షూటింగ్ కోసం జేవీ కాలనీలో ఉండే సాయిసిద్ధు ఇంటికి అమీర్‌పేట నుంచి వచ్చారు. M.మానస, N.మానస, అబ్దుల్ రహీం, సాయి సిద్ధు నలుగురు కలిసి రాత్రి సాయి నివాసంలో మద్యంగా సేవించారు. ఆపై టీ తాగేందుకు లింగంపల్లి అలిండ్ కంపెనీ వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది.

కాగా, ఈ ఘటనకు సంబంధించి సమచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ సాయి సిద్దును ఆసుపత్రికి తరలించారు. అనంతరం ముగ్గురు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆ రాత్రి వారు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సాయిసిద్దు ఇంటికి ఈ ముగ్గురు ఎందుకు వచ్చారు? సీరియల్ షూటింగేనా? అందులో ఏదైన మతలబు ఉందా? అర్థరాత్రి ఎందుకు రోడ్డెక్కారు? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Read Also….  Chirla Jaggireddy: దెబ్బతిన్న రోడ్డు వేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు.. ఆ ఎమ్మెల్యే చేశారంటే!