Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chirla Jaggireddy: దెబ్బతిన్న రోడ్డు వేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు.. ఆ ఎమ్మెల్యే చేశారంటే!

ఈ కాలంలో ప్రభుత్వ సొమ్మును తినే ప్రజాప్రతినిధులున్నారు కాని.. సొంతగా ఖర్చుచేసే వారున్నారా? ఒక్కరున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే తన జేబు నుంచి ఖర్చులు పెడుతున్నారు.

Chirla Jaggireddy: దెబ్బతిన్న రోడ్డు వేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు.. ఆ ఎమ్మెల్యే చేశారంటే!
Mla Chirla Jaggireddy
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 18, 2021 | 6:58 AM

Kottapet MLA Chirla Jaggireddy: ఈ కాలంలో ప్రభుత్వ సొమ్మును తినే ప్రజాప్రతినిధులు ఉన్నారు కాని.. సొంతగా ఖర్చుచేసే వారున్నారా? ఒక్కరున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే తన జేబు నుంచి ఖర్చులు పెడుతున్నారు. రోడ్ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లు వస్తారేమోనని ఎంత ఎదురు చూసినా.. ఫలితం లేకపోవడంతో.. తనే రంగంలోకి దిగారు. ఆయనెవరో కాదు.. తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. రావులపాలెం నుండి కొత్తపేట వరకు పదకొండు కిలోమీటర్లు రోడ్డు వేయిస్తున్నారు.

దెబ్బతిన్న రోడ్డు పునరుద్దరించాలని భావించారు ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. ఇందుకోసం టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. సొంత ఖర్చులతో రోడ్డును నిర్మించాలని తలంచారు. రోడ్లు వేసే భారీ యంత్రాలను తెప్పించి తానే ముందుండి పనులను నడిపిస్తున్నారు. ఓ భారీ యంత్రాన్ని తానే నడిపించి రోడ్డు వేశారు జగ్గిరెడ్డి. ఈ రోడ్డు నిర్మాణం కోసం సొంత నిధులు 8కోట్ల 20లక్షల రూపాయలను ఖర్చుచేస్తున్నారు. భారీ గుంతలు పూడ్చడమేకాకుండా.. 60 ఫీట్ల రోడ్డును నిర్మిస్తున్నారు ఎమ్మెల్యే. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. ఆతర్వాత ప్రభుత్వం రోడ్డు నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లను ఆహ్వానించిన చాలా ఏరియాల్లో రోడ్లు వేసేందుకు ఎవరూ ముందుకురాలేదు.

ఇక, వచ్చే పండగ సీజన్‌ దృష్టిలో ఉంచుకుని.. దేశవిదేశాల నుంచి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దన్న ఉద్దేశంతో తానే ముందుకొచ్చారు ఎమ్మెల్యే. ఎంత ఖర్చైనా రోడ్డు నిర్మించాలని తలంచారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక.. నియోజకవర్గ అభివృద్ధి ఏమాత్రం ఆగదని నిరూపించడానికే రోడ్లు వేయిస్తున్నానంటున్నారు ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. ప్రజా సొమ్మును అపన్నంగా మేసే నేతలు ఉన్న కాలంలో.. సొంత డబ్బులతో రోడ్డు వేస్తున్న ఎమ్మెల్యేను చూసి నియోజకవర్గ ప్రజలు తెగ పొగిడేస్తున్నారు.

Read Also… CM KCR Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో స్వల్ప మార్పులు.. ఎందుకంటే..?