Crime News: మద్యం బిల్లు రూ.300 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ.. తీవ్ర గాయాలతో ఒకరు మృతి !

|

Sep 22, 2021 | 8:34 AM

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం తాగి బిల్లు చెల్లించే విషయంలో తలెత్తిన వివాదంలో దాడి జరగ్గా ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు.

Crime News: మద్యం బిల్లు రూ.300 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ.. తీవ్ర గాయాలతో ఒకరు మృతి !
Follow us on

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం తాగి బిల్లు చెల్లించే విషయంలో తలెత్తిన వివాదంలో దాడి జరగ్గా ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. నరసరావుపేట టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం… పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పొందుగల వెంకటేశ్వరరెడ్డి, మేకల వెంకట కోటిరెడ్డి ఇద్దరూ పోలీసు స్టేషన్‌ రోడ్డులోని ఒక గ్యాస్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని మద్యం తాగేందుకు పట్టణంలోని ఓ బార్‌కు వెళ్లారు. మద్యం బిల్లు రూ.600 అవడంతో వెంకటకోటిరెడ్డి రూ.300 వెంకటేశ్వరరెడ్డిని(46) అడగడంతో నా వద్ద లేవన్నాడు. ఆగ్రహం చెందిన వెంకటకోటిరెడ్డి రాయితో అతని తలపై బలంగా కొట్టాడు.

దీంతో తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వరరెడ్డిని స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also…  Covaxin for Kids: థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శుభవార్త.. త్వరలో చిన్నారులకు కొవాగ్జిన్ టీకా..!

Andhra Pradesh: అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది.. వాలంటీర్ కాస్తా ఎంపీపీగా మారనున్నారు.. ఏపీలో ఆసక్తికర పరిణామం..