Gun Miss Fire: మూత్ర విసర్జన చేస్తున్న ఓ యువకుడి ప్యాంట్ జేబులో తుపాకీ పేలింది. ఈ ఘనటలో అతని కాలికి బుల్లెట్ గాయమైంది. తీవ్రంగా గాయపడిన అతన్ని అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంట సమయంలో టైమ్స్ స్వ్కేర్‌లోని సబ్‌వే స్టేషన్‌లో 39 ఏళ్ల వ్యక్తి టాయిలెట్‌కి వెళ్లాడు. అతని ప్యాంట్‌లో బుల్లెట్లు లోడ్ చేసి గన్ ఉంది. అయితే, ప్యాంట్ తీసే క్రమంలో పొరపాటును గన్ ట్రిగర్ నొక్కాడు. దాంతో గన్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ నేరుగా అతని కాలికి తగింది. తుపాకీ పేలుడుకి భారీ శబ్ధం రాగా.. టాయిలెట్‌లో ఉన్న మరో వ్యక్తి అక్కడి నుంచి భయంతో పరుగులు తీశాడు. కాగా, తనకు ఒక పెద్ద శబ్ధం వినిపించిందని మార్గరీటవిల్లే రిసార్ట్‌లోని సెక్యూరిటీ గార్డ్ మైఖేల్ బౌయీయా(52) మీడియా వర్గాలకు తెలిపాడు.
ఇక ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా గ్రీన్ డ్రెస్ ధరించిన ఓ వ్యక్తి స్టేషన్ ఆవరణలోకి వచ్చాడు. అక్కడే కొంతమంది వ్యక్తులతో మాట్లాడాడు. కాసేపటి తరువాత లైట్ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న మరో వ్యక్తి భయంతో, అనుమానాస్ప రీతిలో స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. అయితే, ఏదో జరిగిందని భావించిన స్థానికులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. వ్యక్తి కాలికి బుల్లెట్ గాయం అవడాన్ని గమనించారు. వెంటనే అతన్ని బెల్లే వ్యూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, టైమ్స్ స్క్వేర్ సబ్‌వేలో ఈ ఘటన జరిగిన రోజే మరో ఘటన కూడా జరిగింది. లెన్ని జేవియర్ అనే మహిళను రైలు నుంచి కింద పడింది. ఈ ఘటనకు ఆమెకు ఒళ్లంతా గీసుకుపోయింది. స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
Also read:
Viral Video: కోపంతో ఊగిపోయిన రాటిల్ స్నేక్.. దాని శబ్దం వింటే ఒళ్ళు గగ్గుర్పొడిచిది..!!
Samantha: మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. నెట్టింట వైరల్.!