AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్టీ అని చుట్టాలింటికొస్తే.. యువతిపై గ్యాంగ్ రేప్.. చికిత్స పొందుతూ మృతి

నిర్భయ చట్టం ఉన్నా.. కొత్తగా దిశ చట్టం అమల్లోకి వచ్చినా.. మహిళలు,చిన్నారులపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మద్యం మత్తులో వావివరుసలు కూడా మరచిపోతున్నారు కామోన్మాదులు. గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే.. అసలు ఇంట్లో పిల్లలను బంధువుల ఇంటికి పంపాలన్నా కూడా.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని మాచర్ల మండలం బీకేవీ చెంచుకాలనీలో డిసెంబర్ 24న దారుణ ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన ఓ 22 ఏళ్ల యువతిపై.. […]

పార్టీ అని చుట్టాలింటికొస్తే.. యువతిపై గ్యాంగ్ రేప్.. చికిత్స పొందుతూ మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 15, 2020 | 10:49 AM

Share

నిర్భయ చట్టం ఉన్నా.. కొత్తగా దిశ చట్టం అమల్లోకి వచ్చినా.. మహిళలు,చిన్నారులపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మద్యం మత్తులో వావివరుసలు కూడా మరచిపోతున్నారు కామోన్మాదులు. గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే.. అసలు ఇంట్లో పిల్లలను బంధువుల ఇంటికి పంపాలన్నా కూడా.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని మాచర్ల మండలం బీకేవీ చెంచుకాలనీలో డిసెంబర్ 24న దారుణ ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన ఓ 22 ఏళ్ల యువతిపై.. ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు ఒడిగట్టారు. మద్యం మత్తులో తెలిసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సదరు యువతి.. మంగళవారం చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us