Gang Stealing Corpses : పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పాట్‌లో శ్మశాన వాటికల నుంచి మృతుల దుస్తులు దొంగిలించిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు దేశంలో తీవ్రతరం అవుతున్న కరోనా వైరస్ సంక్షోభం మధ్య సోషల్ మీడియా, జాతీయ దినపత్రికలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న మృతదేహాలను జాబితా చేస్తున్న సమయంలో ఈ అరెస్ట్‌లు జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
నిందితులు చనిపోయినవారి దుస్తులు, చీరలు, ఇతర వస్తువులను దొంగిలించేవారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో వారు బెడ్‌షీట్లు, చీరలు, చనిపోయినవారి దుస్తులు దొంగిలించేవారని తేలింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాస్, 52 వైట్ చీరలు, ఇతర దుస్తులు దొరికాయన్నారు. ఈ దుస్తులను శుభ్రం చేసి, అనంతరం ఇస్త్రీ చేసి మళ్లీ విక్రయిస్తారని అధికారి తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన కొందరు వస్త్ర వ్యాపారులు ఈ వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఒక రోజు దోపిడీకి ₹ 300 చెల్లిస్తారని తెలిపారు. .
అరెస్టయిన ఏడుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ సంక్షోభ సమయంలో అరెస్టు అయ్యారు. దొంగిలించడమే కాకుండా, అంటువ్యాధి చట్టం క్రింద కూడా వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.