Accident at National Highway: రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదర్శ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని నేషనల్ హైవే 8పై రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం అనంతరం లారీల క్యాబిన్లల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో నిమిషాల్లోనే నలుగురు వ్యక్తులు, వాహనాలు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక మృతదేహాన్ని వాహనంలో నుంచి బయటకు తీసి జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మూడు మృతదేహాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఆదర్శనగర్ ఎస్ఐ కన్హయ్య లాల్ పేర్కొన్నారు. ఈ ఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Rajasthan | Four people killed as two vehicles caught fire after a collision at National Highway 8 in Ajmer: Sub Inspector of Adarsh Nagar, Kanhaiya Lal pic.twitter.com/OWuCd3F59G
— ANI (@ANI) August 17, 2021
Also Read: