Accident: భద్రాద్రి కొత్త గూడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి.. 8 మందికి గాయాలు..

|

Jan 28, 2022 | 2:34 PM

భద్రాద్రి కొత్త గూడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగొండకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఎనమిది మందికి గాయాలయ్యాయి..

Accident: భద్రాద్రి కొత్త గూడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి.. 8 మందికి గాయాలు..
Follow us on

భద్రాద్రి కొత్త గూడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగొండకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఎనమిది మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఆందోళనకరంగా ఉంది. బొలేరో వాహనంలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే చనిపోయారు. ఇక వివరాల్లోకి వెళితే.. చంద్రగొండ మండలంలోని సూజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలేరో వాహనంలో బయలుదేరారు. ఇదే క్రమంలో తిప్పనపల్లి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన బొగ్గు టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కత్తి స్వాతి, సుజాత అనే ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మొత్తం పది కూలీలు గాయపడ్డారు. అయితే గాయపడినవారిలో మరో ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో చనిపోయారు. గాయపడిన వారిని 108 ద్వారా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి: Nellore District: పొలం పనులు చేస్తుండగా.. బయటపడ్డ 6 బీరువాలు, ఒక బైక్.. ఎంక్వైరీ చేయగా

Viral Video: అయ్యో… ఈ తల్లి ఎలుగుకి ఎన్ని కష్టాలో.. ఓవైపు నవ్వొస్తుంది.. మరోవైపు జాలేస్తుంది