హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో పెను ప్రమాదం తప్పింది. కూకట్‌పల్లి సమీపంలో బాలానగర్ మెట్రో స్టేషన్ కింద జాతీయ రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ఇంజన్ లో మంటలు చెలరేగి, కారు ముందు భాగానికి వ్యాపింాచాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై కారు నుంచి దిగడంతో, ప్రాణనష్టం తప్పింది. కారు నడుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని వారు తెలిపారు.
మంటలకు కారు ధ్వసమయింది. ఈ నేపథ్యంలో బాలానగర్ మెట్రో స్టేషన్ దారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలార్పుతున్నారు. కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..