Fire Accident In Train: రైలు బోగిలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు చివరి బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే రైలును నిలిపివేసి మంటలను ఆర్పేవేశారు. ఈ ఘటన భువనగిరి సమీపంలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనతో పరుగులు తీశారు.
అయితే ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎవరైనా గాయపడ్డారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో ఘటన స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను ఆర్పివేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి