తన పిల్లలను చంపి ఉరివేసుకున్న తండ్రి.. కేసును ఛేదించిన పోలీసులు..
టంగుటూరు గ్రామానికి చెందిన నీరటి రవి 2022 సంవత్సరంలో గుంటూరుకి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి ద్వారా విజయనగరంకి చెందిన జి.ఎస్.ఎన్ ఫౌండేషన్ మనీ సర్కులేషన్స్కి చెందిన సంస్థలో సభ్యునిగా చేరాడు. జి.ఎస్.ఎన్ ఫౌండేషన్లో ముందుగా రూ. 200 కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చి ప్రతి నెల రూ.1000 చొప్పున ఆరు నెలలు ఇచ్చేవారు. రవి తన ఊర్లో ఉన్న వారితో జి.ఎస్.ఎన్ ఫౌండేషన్లో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించాడు. రవి సేకరించిన డబ్బు తిరుపతిరావుకు పంపగా తిరుపతిరావు ప్రతినెల రవికి తోటి సభ్యులకు డబ్బులు చెల్లించేవాడు.
టంగుటూరు గ్రామానికి చెందిన నీరటి రవి 2022 సంవత్సరంలో గుంటూరుకి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి ద్వారా విజయనగరంకి చెందిన జి.ఎస్.ఎన్ ఫౌండేషన్ మనీ సర్కులేషన్స్కి చెందిన సంస్థలో సభ్యునిగా చేరాడు. జి.ఎస్.ఎన్ ఫౌండేషన్లో ముందుగా రూ. 200 కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చి ప్రతి నెల రూ.1000 చొప్పున ఆరు నెలలు ఇచ్చేవారు. రవి తన ఊర్లో ఉన్న వారితో జి.ఎస్.ఎన్ ఫౌండేషన్లో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించాడు. రవి సేకరించిన డబ్బు తిరుపతిరావుకు పంపగా తిరుపతిరావు ప్రతినెల రవికి తోటి సభ్యులకు డబ్బులు చెల్లించేవాడు. ఈ క్రమంలో వ్యాపారం బాగా నడుస్తున్న క్రమంలో 8 నెలల క్రితం రవి 0.39 గుంటల భూమిని కనుగోలు చేసి తన ముగ్గురు పిల్లల పేరు మీద ఏస్.ఎన్.యూ ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాడు. గత మూడు నెలల నుండి జి.ఎస్.ఎన్ ఫౌండేషన్ తరఫున తిరుపతిరావు డబ్బులు చెల్లించకపోవడంతో రవిని గ్రామస్తులు చుట్టుపక్కన గ్రామాల సభ్యులు డబ్బుల గురించి అడుగుతూ వస్తున్నారు. ఈ విషయం బయట తెలియడంతో శ్రీనివాస్, మహేష్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డిలు రవితో మాట్లాడి జి.ఎస్.ఎన్ ఫౌండేషన్ పేరు మీద ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తున్నావని మేము న్యూస్ పేపర్లలో వార్తలు రాస్తామని బెదిరించి అతని వద్ద 20 లక్షల డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 19న రవి తన భార్య పుస్తలతాడు తాకట్టుపెట్టి 2 లక్షల 50 వేల రూపాయలు తెచ్చి విలేకరులకు ఇచ్చాడు. శంకర్పల్లి గ్రామంలో నివసించే హోంగార్డు నాగరాజు భార్య మనీల కూడా జిఎస్ఎన్ ఫౌండేషన్లో రవి ద్వారా డబ్బులు పెట్టినందున వారు కూడా డబ్బుల కోసం రవిని ఒత్తిడి చేశారు. దీంతో చేసేదేం లేక రవి తన భార్య పేరున రావులపల్లి గ్రామంలో కొన్న రెండు ప్లాట్లకు సంబంధించిన పత్రాలను శంకర్పల్లిలో ఉండే శివకుమార్ అనే వ్యక్తి వద్ద తాకట్టుపెట్టి రూ.18 లక్షలు తీసుకొని నాగరాజుకు ఇచ్చాడు. అయినా మిగతా డబ్బుల గురించి విలేకరులు రవిని ఒత్తిడి చేయగా వారి బాధలు తట్టుకోలేక రవి చావాలని నిర్ణయించుకున్నాడు. తాను చస్తే తన పిల్లలు అనాథలు అవుతారని భావించి ఈనెల 3న రాత్రి తన ముగ్గురు కొడుకుల మెడకు ఉరితాడు బిగించి తాను కూడా నూతనంగా నిర్మించుకున్న ఫంక్షన్ హాల్ రేకుల షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న జి.ఎస్.ఎన్ ఫౌండేషన్ కి చెందిన A1 తిరుపతిరావు, A2 మంగలి శ్రీనివాస్, A3 కుర్మా శ్రీనివాస్, A4 వడ్డే మహేష్, A5 శ్రీపురం శ్రీనివాస్ రెడ్డి, A6 ప్రవీణ్ కుమార్, A7. హోమ్ గార్డ్ అల్లూరి రాజు అలియాస్ నాగరాజులను అరెస్ట్ చేయగా.. A8 మనీలా, A9 రామకృష్ణలు పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచి అనంతరం రిమాండ్ కు తరలించారు. అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని దురాశతో ఎలాంటి మోసపూరిత స్కీం లలో, ఆన్లైన్ ఆప్ లలో డబ్బులు పెట్టి మోసపోవద్దని, ఇలాంటి స్కీంల గురించి ఏదైనా సమాచారం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని డి.సి.పి శ్రీనివాస్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..