Online Gambling: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. భార్యాపిల్లల్ని చంపి.. ఆపై

|

Jan 03, 2022 | 3:23 PM

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఓ కుటుంబాన్ని బలితీసుకుంది.. మొబైల్ గేమ్‌లలో పిల్లలే కాదు.. పెద్దలు కూడా మునిగిపోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు..

Online Gambling: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. భార్యాపిల్లల్ని చంపి.. ఆపై
Online Gambling
Follow us on

ఆన్‌లైన్‌ గేమ్స్ వ్యసనం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. సరదాగా మొదలై వ్యసనంగా మారి…అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల నిండు జీవితాలు మొదలు కాకుండానే ఆగిపోయేలా చేశాయి. ఏ పనీ చేయకుండా, గేమ్ లకు బానిసై, అప్పులపాలై.. భార్య, పిల్లలు ఉసురు తీశాడో వ్యసనపరుడు. ఈ విషాద ఘటన తమిళనాడులో కలకలం రేపింది. పెరుంగుడి పెరియార్‌లోని ఓ అపార్టుమెంట్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు మణికంఠన్‌ అనే వ్యక్తి.. కోయంబత్తూర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.. అయితే, రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.. ఆన్‌లైన్‌లో నగదు పెట్టి గేమ్‌లు ఆడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. డిసెంబర్ 31న రాత్రి ఘర్షణ కూడా పడ్డారు. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను చంపి మణికంఠన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి తలుపులు మూసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు..దర్యాప్తు చేపట్టారు.

బ్యాంకులో హాయిగా జీతంతో పనిచేసిన మణికందన్ సౌకర్యాల కొరత లేని సమయంలో పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చిందని, అయితే ఉద్యోగానికి వెళ్లకపోవడానికి కారణమేంటి? డబ్బును పోగొట్టుకునే స్థాయికి ఆన్‌లైన్ గేమింగ్‌లో మునిగిపోయారా? లేక మరేదైనా మార్గంలో డబ్బు పోగొట్టుకున్నారా? అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇలాగే ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. పోలీసులు ప్రజలను ఎంత అవేర్‌నేస్‌ తీసుకువస్తున్నా, ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

Also Read:  జిల్లాలో అర్థరాత్రి భయానక క్షుద్రపూజలు.. పంది గొంతు కోసి.. పసుపు, కుంకుమ చల్లి..

నదిలో దూకిన లేడీ వాలంటీర్‌.. పరుగుపరుగన వచ్చి ఆమెను కాపాడిన కౌన్సిలర్.. కానీ