Crime News: కలివిడిగా గడిపే బామ్మ కనిపించకుండా పోయింది.. తీరా చూస్తే మరుగు దొడ్డిలో..
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. బంగారు ఆభరణాల కోసం డెబ్బై ఆరవై ఏళ్ల వృద్ధురాలిని అతి కిరాతకంగా హతమార్చి మరుగుదొడ్డిలో కుక్కి మరీ పరారయ్యారు దుండగులు. భోగాపురం మండలం మహారాజపేటలో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ గ్రామంలో జరిగిన హత్య అనేక అనుమానాలకు దారి తీస్తుంది.

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. బంగారు ఆభరణాల కోసం డెబ్బై ఆరవై ఏళ్ల వృద్ధురాలిని అతి కిరాతకంగా హతమార్చి మరుగుదొడ్డిలో కుక్కి మరీ పరారయ్యారు దుండగులు. భోగాపురం మండలం మహారాజపేటలో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ గ్రామంలో జరిగిన హత్య అనేక అనుమానాలకు దారి తీస్తుంది.
ముద్దాడ అప్పయ్యమ్మ తన భర్త మృతి చెందడంతో పాటు కుమార్తె నల్లగంగమ్మకు కూడా వివాహమై విశాఖపట్నం నివాసం ఉండటంతో ఆమె ఒక్కటే తన సొంత ఇంట్లో నివాసం ఉంటుంది. అప్పయమ్మకు బంగారం అంటే ఇష్టం. దీంతో ఆమె తన బంగారాన్ని నిరంతరం ఒంటిపైనే ధరించే ఉంటుంది. సుమారు ఇరవై తులాలకు పైగా బంగారం జమ చేసుకుంది. అప్పయ్యమ్మ ఇల్లు కూడా పెద్దదే కావడంతో రెండు గదుల్లో తాను నివాసం ఉంటూ మిగిలిన గదులను అద్దెకిచ్చింది.
ఇదిలావుండగా అప్పయమ్మ ఎప్పటిలాగే సాయంత్రం ఇంటి బయట సరదాగా అందరితో మాట్లాడి ఆ తర్వాత లోపలకి వెళ్ళిపోయింది. అలా ఇంట్లోకి వెళ్ళిన అప్పయమ్మ మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా బయటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే చుట్టుపక్కల వారు ఆమె ఇంట్లోకి వెళ్లి ఇల్లంతా కలియతిరిగారు. అప్పమయ్య ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటి లోపలే ఉన్న మరుగుదొడ్డి వద్దకు వెళ్లి చూశారు. అంతే అలా మరుగుదొడ్డి వైపు చూసిన వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అప్పయమ్మ మరుగుదొడ్డిలో రక్తం మడుగులో పడి ఉంది. వెంటనే స్థానికులు ప్రక్క గ్రామం అయిన రాజాపులోవలో ఉన్న అప్పయమ్మ మనవరాలు జ్యోతి కి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న జ్యోతి పరిస్థితి గమనించి అప్పయమ్మ మృతి చెందినట్లు, ఆమె ఒంటి పై ఉన్న ఇరవై తులాల బంగారు గాజులు, పుస్తెలతాడుతో పాటు ఇతర ఆభరణాలు మిస్సయినట్లు గుర్తించారు. జరిగిన విషయాన్ని మృతురాలి కుమార్తె నల్ల గంగమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న సిఐ వెంకటేశ్వర రావు బృందం ఘటనా స్థలానికి చేరుకుని పలు కీలక ఆధారాలు సేకరించారు. అప్పయమ్మ మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అప్పయమ్మ మరణించడం, ఆమె ఒంటి పై ఉన్న ఆభరణాలు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు బంగారం కోసం అప్పయమ్మను హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం అప్పయ్యమ్మ డెడ్ బాడీని విజయనగర ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఎప్పుడూ అందరితో కలివిడిగా సరదాగా గడిపే అప్పయ్యమ్మ దారుణ హత్యతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి త్వరలో నిందితులను పట్టుకుని న్యాయం చేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు వేగవంతం చేశారు. అయితే జరిగిన హత్య అప్పయమ్మ కోసం పూర్తిగా తెలిసిన వారు చేసిన పనా? లేక జాతీయ రహదారి ప్రక్కనే కావడంతో అంతరాష్ట్ర దోపిడీ దొంగలు చేసిన పనా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
