Drunk And Drive Cases: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా, పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పినా మందు బాబుల తీరు మాత్రం మారడం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు సైతం హానికరంగా మారుతున్నారు కొందరు ప్రబుద్ధులు. అయితే పోలీసులు జరిమానా వేసినా, కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రావడం లేదు. మందేసి వాహనాలతో రోడ్ల మీదికి వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రంక్ డ్రైవ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండడమే దీనికి సాక్ష్యంగా కనబడుతోంది. మరీ ముఖ్యంగా వారాంతాల్లో మద్యం తాగి చిక్కుతోన్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది.
తాజాగా శుక్రవారం రాత్రి నగరంలో పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మందు కొట్టి వాహనాలను నడుపుతూ కొందరు పోలీసులకు చిక్కారు. నగరంలో అత్యంతా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకటైన జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో శుక్రవారం రాత్రి 12 కేసులు నమోదయ్యాయి. వీటిలో 4 కార్లు, 8 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇక రోడ్ నెంబర్ 45లో 8 కేసులు నమోదుకాగా వీటిలో 5 కార్లు, 3 బైక్స్ ఉన్నాయి. వెంకటగిరిలో ఏకంగా 20 కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కార్లు ఉండగా 13 బైక్ యజమానులపై పోలీసులు డ్రంక్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. ఇక కరోనా కారణంగా చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్న సమయంలో కూడా ఇలా భారీగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తులో ఇతరుల ప్రాణాలను తీస్తోన్న మందు బాబులపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజానీకం అభిప్రాయపడుతోంది.
Japan Internet Speed: ఒక్క సెకనులో 57 వేల సినిమాలు డౌన్‌లోడ్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్.
Rowdy sheeter murder: హైదరాబాద్ పాతబస్తీలో ముస్తాక్ అనే రౌడీ షీటర్ హత్య