AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Emoji Day: ఇకపై ఎమోజీలు మాట్లాడుతాయి… వరల్డ్‌ ఎమోజీ డే సందర్భంగా ఫేస్‌బుక్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.

Facebook New Emoji: ఒకప్పుడు చాటింగ్‌ అంటే కేవలం టెక్ట్స్‌ మెసేజ్‌లను పంపుకోవడమే. కానీ రకరకాల యాప్‌లు వచ్చిన తర్వాత చాటింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు...

World Emoji Day: ఇకపై ఎమోజీలు మాట్లాడుతాయి... వరల్డ్‌ ఎమోజీ డే సందర్భంగా ఫేస్‌బుక్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.
Facebook Emojis
Narender Vaitla
|

Updated on: Jul 17, 2021 | 7:03 AM

Share

Facebook New Emoji: ఒకప్పుడు చాటింగ్‌ అంటే కేవలం టెక్ట్స్‌ మెసేజ్‌లను పంపుకోవడమే. కానీ రకరకాల యాప్‌లు వచ్చిన తర్వాత చాటింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే అందుబాటులోకి వచ్చినవే ఎమోజీలు. తమ మూడ్‌ను అవతలి వ్యక్తులకు తెలియజేయడానికి ఎమోజీలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. టెక్‌ కంపెనీలు కూడా రకరకాల ఎమోజీలను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎమోజీలు, జీఎఫ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ ఎమోజీల్లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది ప్రముఖ సోషల్‌ మీడియాలో దిగ్గజం ఫేస్‌బుక్‌.

శనివారం (జులై 17) వరల్డ్‌ ఎమోజీ డే.. అయితే ఇందుకు రెండు రోజుల ముందే ఫేస్‌బుక్ తమ యూజర్ల కోసం ‘సౌండ్‌మోజీ’ పేరుతో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇకపై యూజర్లు సౌండ్‌తో కూడిన ఎమోజీలను సెండ్ చేసుకోవచ్చన్నమాట. ఈ ఫీచర్‌ అందుబాటులోకి రావాలంటే యూజర్లు తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనం పంపించాలనుకునే ఎమోజీని సెలక్ట్‌ చేసుకొని పక్కనే ఉన్న సౌండ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. దీంతో అవతలి వ్యక్తికి సౌండ్‌తో కూడిన ఎమోజీ వెళుతుంది. ఫేస్‌బుక్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ భలే ఉంది కదూ! మరెందుకు ఆలస్యం మీరు కూడా ఎంచక్కా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోండి. అయితే ఫేస్‌బుక్‌ ఈ ఫీచర్‌ను కేవలం మెసేంజర్ యాప్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Also Read: World Emoji Day: మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతున్నాయి.. ఎమోజీలు ఎలా పుట్టుకొచ్చాయి..!

Covid-19 vaccine: గుడ్ న్యూస్.. త్వరలోనే పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. వెల్లడించిన కేంద్రం

Japan Internet Speed: ఒక్క సెకనులో 57 వేల సినిమాలు డౌన్‌లోడ్‌.. అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్‌.