డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిని నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఎడ్విన్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరాలో ఎడ్విన్ కీలక పాత్ర పోషించాడు. డ్రగ్స్ కేసులో నారాయణ బోర్కర్ అనే వ్యక్తిని 3 నెలల క్రితం నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ హైదరాబాద్‌లో సరఫరా చేయడంలో నారాయణ బోర్కర్‌ది కీలక పాత్ర. అతను ఇచ్చిన సమాచారంతో నార్కోటిక్ విభాగం పోలీసులు గోవాలో పలువురిపై నిఘా పెట్టారు.
డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్ గత 3 నెలలుగా గోవాలోనే ఉంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో 15 రోజులు ఎడ్విన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు గోవాలో అతన్ని అరెస్ట్ చేశారు. ఎడ్విన్ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైద్రాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు. పోలీసుల కళ్లుగప్పి కొన్నేళ్లుగా ఎడ్విన్ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ప్రధానంగా ముంబై, ఢిల్లీ, కర్నాటక, గోవా, హైదరాబాద్, తమిళనాడు రాష్ట్రాలకు ఎడ్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్‌ను పోలీసులు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారించే అవకాశం ఉంది. ఎడ్విన్ నోరువిప్పితే.. మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి