AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రకుల అమ్మాయితో మాట్లాడినందుకు ఇలా..

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై రెండేళ్లు కావోస్తోంది. నేటి వరకు ఆర్థిక సంస్కరణలు అనేకం అమలు చేసుకొని అర్ధరాత్రి పార్లమెంటు సమావేశాలు జరుపుకున్నాము. వందకు పైగా ఉప గ్రహా లను ఏకకాలంలో నింగికి పంపించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసుకున్నాము.

అగ్రకుల అమ్మాయితో మాట్లాడినందుకు ఇలా..
Jyothi Gadda
|

Updated on: Feb 25, 2020 | 5:06 PM

Share

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై రెండేళ్లు కావోస్తోంది. నేటి వరకు ఆర్థిక సంస్కరణలు అనేకం అమలు చేసుకొని అర్ధరాత్రి పార్లమెంటు సమావేశాలు జరుపుకున్నాము. వందకు పైగా ఉప గ్రహా లను ఏకకాలంలో నింగికి పంపించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసుకున్నాము. కానీ, మరో వైపు దళితులపై దాడులు, దళితుల వెలివేతలు జరగడ దురదృష్టమనే చెప్పుకోవాలని. నాగరిక సమాజంలో దళితులు వివక్షతకు, అణచివేతకు గురవుతున్నారని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. దళిత యువకుడు అగ్రకుల అమ్మాయితో మాట్లాడడాన్నికుల పెద్దలు రెచ్చిపోయారు. దాన్ని జీర్ణించుకోలేని కొందరు పెద్ద మనుషులు అమానుషంగా ప్రవర్తించారు. జాత్యాహాంకారంతో రెచ్చిపోయి..ఆ యువకుడిపై పైశాచికం ప్రదర్శించారు. యువకుడిని విచక్షణా రహితంగా కొట్టారు. మెకానిక్‌ షాప్‌లో పనిచేసే ఓ యువకుడు ఈ నెల 18న అతడికి తెలిసిన అగ్ర కులానికి చెందిన యువతితో మాట్లాడాడు. ఇద్దరూ ఓ కాఫీ షాపులో కలుసుకొని మాట్లాడుతుండగా గమనించిన అగ్ర వర్ణ కుల పెద్దలు, అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఆ యువకుడికి గుండు గీయించి అవమానపరిచారు. అతనిపై, కుటుంబ సభ్యులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఘటనపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.