Mahesh Bank: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మహేష్ కో- ఆపరేటివ్ బ్యాంక్ (Mahesh Bank )సర్వర్ ను హ్యాక్ చేసి ఏకంగా రూ. 12 కోట్లు కొల్లగొట్టారు. బ్యాంకు సాంకేతిక సిబ్బంది ఈ విషయం గుర్తించి స్పందించే లోపే నష్టం జరిగిపోయింది. బ్యాంకు నుంచి దోచుకున్న సొమ్మును సుమారు 100 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. దీనిపై మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ నేరగాళ్లు బ్యాంక్ సర్వర్ ను ఎలా హ్యాక్ చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా దోచుకున్న సొమ్మును ఏయే ఖాతాలకు బదిలీ అయిందో ఆ వివరాలను పరిశీలిస్తున్నారు. కాగా ఇప్పటివరకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలపై దాడి చేసి సొమ్మును కాజేస్తున్న సైబర్ దొంగలు ఇప్పుడు ఏకంగా బ్యాంకు ఖాతాలను దోచుకోవడం సంచలనంగా మారింది. అది కూడా ఎంతో భద్రత కలిగిన బ్యాంక్ మెయిన్ సర్వర్ ను హ్యాక్ చేయడం ఆందోళన కలిగించే విషయం.
Also Read: Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్.. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు..
Akshay Kumar: కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్!.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Harish Rao: కేంద్రంపై మరో లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు.. ఈసారి దేనికోసమంటే..