Cyber Crime: ఇంటర్‌నెట్‌ స్పీడ్‌ పెంచుతామంటూ ఫోన్‌లు వస్తున్నాయా.? స్పందించారో అంతే సంగతులు..

Cyber Crime: పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్ల దాడులు మాత్రం ఆగడం లేదు. నేరాలను అడ్డుకోవడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొత్త రకం మోసాలతో ప్రజల ఖాతాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు...

Cyber Crime: ఇంటర్‌నెట్‌ స్పీడ్‌ పెంచుతామంటూ ఫోన్‌లు వస్తున్నాయా.? స్పందించారో అంతే సంగతులు..
Follow us

|

Updated on: May 30, 2022 | 6:42 PM

Cyber Crime: పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్ల దాడులు మాత్రం ఆగడం లేదు. నేరాలను అడ్డుకోవడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొత్త రకం మోసాలతో ప్రజల ఖాతాల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. మొన్నటి వరకు ఫేస్‌బుక్‌లో ఫేక్‌ అకౌంట్ క్రియేట్ చేస్తూ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారి నుంచి డబ్బలు వసూలు చేసిన కేటుగాళ్లు తాజాగా ఏకంగా వాట్సాప్‌నే ఇందుకు ఆయుధంగా వాడుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కొత్త రకం మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు..

టెలికాం సంస్థల నుంచి కాల్‌ చేస్తున్నట్లు నమ్మించి సైబర్‌ మోసగాళ్లు ఇంటర్‌నెట్‌ స్పీడ్‌ పెంచుకోవడానికి *401* డయల్ చేయని చెబుతున్నారు. సదరు వ్యక్తులు అడిగినట్లు డయల్‌ చేయగానే బాధితుడికి వాట్సాప్‌ ఖాతాను లాగిన్‌ చేయడానికి పిన్‌ వస్తుంది. వెంటనే ఆ వ్యక్తి మొబైల్‌లోని వాట్సాప్‌ ఖాతా ఆటోమెటిక్‌గా లాగవుట్‌ అవుతుంది. దీంతో వాట్సాప్‌ నుంచి క్షణాల్లో ఫోన్‌లోని కాంటాక్ట్‌లకు ఓ మెసేజ్‌ వెళుతుంది. ‘అర్జెంట్‌గా డబ్బులు అవసరం ఉన్నాయి. సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చేస్తాను’ అంటూ మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఇతర పేటీఎం, యూపీఐ నెంబర్లకు డబ్బులు పంపించమంటూ మెసేజ్‌లు పెడుతున్నారు.

దీంతో కొందరు తమ సన్నిహితులు ఆపదలో ఉన్నారని భావించి వెనకా ముందు చూసుకోకుండా డబ్బులు పంపిచేసి, తర్వాత మోసపోయామని తెలిసి వాపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి మోసాలు తరుచుగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తులు చెప్పినట్లు నంబర్లను డయల్‌ చేయడం ద్వారా ఫోన్‌ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..