Cyber Crime: కొరియర్ పేరుతో నిండా ముంచేశారు.. ఒక్క ఫోన్ కాల్‌తో కోటి 52 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు..

| Edited By: Venkata Chari

Nov 21, 2023 | 9:13 PM

ఎంత ట్రై చేసినా, తిరిగి ఆ ఫోన్ నెంబర్లు కలవకపోవడంతో తను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు ఆ బాధితుడు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో FedEx కొరియర్ పేరుతో నేరాలు మితిమీరి పోయాయి. ఒకే తరహా ప్లాన్ తో పదేపదే బాధితులకు కాల్స్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కోట్లు కాజేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో పాటు, ఓ పెద్ద సంస్థలో పనిచేసే ప్రొఫెసర్ ను సైతం ఇదే తరహాలో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.

Cyber Crime: కొరియర్ పేరుతో నిండా ముంచేశారు.. ఒక్క ఫోన్ కాల్‌తో కోటి 52 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు..
Cyber Crime
Follow us on

Cyber Crime: ఒక్క ఫోన్ కాల్‌తో కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు పలువురు బాధితులు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూ ప్రతిరోజు బాధితులు మోసపోతూనే ఉన్నారు. తీరా అది ఫ్రాడ్ అని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ కొరియర్ సంస్థ పేరును వాడుకొని సైబర్ నేరగాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. FedEx కొరియర్ పేరును వాడుకొని బాధితులకు ఫోన్ కాల్స్ చేస్తూ కోట్లు కొల్లబడుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక సీనియర్ సిటిజన్‌కు FedEx కొరియర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి రూ. 1.52 కోట్లు లాగేశారు. తన పేరు మీద ఒక అనుమానాస్పద కొరియర్ వచ్చిందంటూ ఫోన్ చేశారు. డ్రగ్స్‌తో పాటు, క్రెడిట్ కార్డ్స్, పాస్ పోర్ట్ ఆ కొరియర్‌లో ఉన్నాయని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ముంబై పోలీసులు కాల్ చేస్తారంటూ బాధితుడిని భయపెట్టారు.

కొరియర్ బాయ్ కాల్ కట్ చేయగానే ప్రదీప్ సావంత్ పేరుతో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అంటూ కాల్ చేశారు. మీ పేరు మీద ఎవరో అగంతకులు ఫేక్ బ్యాంక్ అకౌంట్ తెరిచారు అంటూ నమ్మించారు. ఈ కొరియర్‌ని వాళ్లే పంపి ఉంటారని బాధితుడిని నిజమేమోనని నమ్మించారు. ఇందులో కోట్ల రూపాయలు దేశం దాటిపోయే ప్రమాదం ఉందని మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా ఎంటర్ అవుతుందని బాధితుడిని భయపెట్టారు. తన పేరు మీద ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్ లను క్లోజ్ చేయాల్సిందిగా బాధితుడికి సూచించారు. మరో కొత్త బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి పాత బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఈ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసి వాటి వివరాలు తమకు తెలపాల్సిందిగా బాధితుడిని మభ్య పెట్టాడు. మనీ లాండరింగ్ జరిగిందా లేదా వెరిఫై చేసి డబ్బులు రిటర్న్ చేస్తామని బాధితుడికి చెప్పటంతో ఇదంతా నిజమేనని నమ్మి తన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. కోటి 52 లక్షలు సైబర్ నేరగాళ్లకు ఇచ్చేశాడు.

ఎంత ట్రై చేసినా, తిరిగి ఆ ఫోన్ నెంబర్లు కలవకపోవడంతో తను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు ఆ బాధితుడు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో FedEx కొరియర్ పేరుతో నేరాలు మితిమీరి పోయాయి. ఒకే తరహా ప్లాన్ తో పదేపదే బాధితులకు కాల్స్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కోట్లు కాజేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో పాటు, ఓ పెద్ద సంస్థలో పనిచేసే ప్రొఫెసర్ ను సైతం ఇదే తరహాలో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రూ. 33 లక్షలు కొట్టేయగా, ప్రొఫెసర్ నుంచి లక్ష రూపాయలు కాజేశారు. మెట్రో నగరాల్లోనే ఎడాదికి 250 కి పైగా కేసులు కేవలం కొరియర్ సంస్థ పేరుతోనే సైబర్ నేరాలు జరుగుతున్నట్టు సమాచారం. ఒకప్పుడు ఓటీపీ, ఆధార్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ కేసులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు కొరియర్ పేరుతో ఫ్రాడ్స్స్ ఎక్కువ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే:-

* ఎట్టి పరిస్థితుల్లో స్పామ్ నంబర్ల నుంచి కాల్స్ ఆన్సర్ చేయకండి.

* కొరియర్ సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నాం అనగానే అలెర్ట్‌గా ఉండండి.

* వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.

* ఎలాంటి పరిస్థితిలోనూ మీ బ్యాంక్ వివరాలు ఎవరికి ఇవ్వకండి.

* పోలీసులం అని చెప్పి కాల్స్ చేసినా సరే మీ బ్యాంక్ ఖాతాల గురించి ఎలాంటి వివరాలు ఇవ్వకండి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..