Andhra Pradesh: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదం.. ఒక్కొక్కటిగా బయటపడుతోన్న కొత్త కోణాలు..

Visakhapatnam Fishing Harbour: మరోవైపు ఈ సంఘటనతో.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సెక్యూరిటీలో డొల్లతనం బయటపడింది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు గుర్తించారు. బోట్లు తగులబెట్టింది బయటి వ్యక్తులేనని అనుమానిస్తున్నారు. భద్రతా లోపాల గురించి ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో సెక్యూరిటీని పెంచాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ మత్స్యకారులు వాపోతున్నారు.

Andhra Pradesh: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదం.. ఒక్కొక్కటిగా బయటపడుతోన్న కొత్త కోణాలు..
Fishing Harbour
Follow us

|

Updated on: Nov 21, 2023 | 9:22 PM

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాద స్థలం‌లో పార్టీ జరిగినట్లు ఆధారాలు గుర్తించారు. ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట యూట్యూబర్ నానిపై అనుమానాలు వచ్చాయి. అయితే, అతగాడి ప్రమేయానికి సంబంధించి ఆధారాలు దొరకకపోవడంతో ఇతర కోణాల్లో విచారిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాలపైన అనుమానం వ్యక్తం అవుతుండడంతో ఆ దిశగా కూడా దర్యాప్తు జరుగుతోంది.

ఇక హార్బర్‌ సమీపంలోనే పెట్రో నిల్వలు చేసే సంస్థలు, ఈస్టర్న్ నేవీ, షిప్ బిల్డింగ్ యూనిట్స్, కంటైనర్ కార్పొరేషన్ లాంటి సంస్థలు ఉండడంతో, ఫిషింగ్‌ హార్బర్‌ భద్రతపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ సంఘటను సంబంధించి ఇప్పటివరకు నిందితులను గుర్తించలేకపోవడాన్ని రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి. దీంతో విశాఖ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రమాదంలో 35 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. మొత్తం 20 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఈ సంఘటనతో.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సెక్యూరిటీలో డొల్లతనం బయటపడింది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు గుర్తించారు. బోట్లు తగులబెట్టింది బయటి వ్యక్తులేనని అనుమానిస్తున్నారు. భద్రతా లోపాల గురించి ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో సెక్యూరిటీని పెంచాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ మత్స్యకారులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

హార్బర్‌లో పోలీస్‌ ఔట్‌ పోస్ట్ ఏర్పాటు చేస్తే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌లోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో తెలియదంటున్నారు వాళ్లు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023