Vizag Accident: బడికి వెళ్తుండగా ఘోరం.. స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురు చిన్నారులకు తీవ్రగాయాలు..

Visakhapatnam Accident: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన లారీ.. స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం విశాఖలోని సంఘం - శరత్ థియేటర్ దగ్గర చోటుచేసుకుంది.

Vizag Accident: బడికి వెళ్తుండగా ఘోరం.. స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురు చిన్నారులకు తీవ్రగాయాలు..
Visakhapatnam Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 22, 2023 | 11:22 AM

Visakhapatnam Accident: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన లారీ.. స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం విశాఖలోని సంఘం – శరత్ థియేటర్ దగ్గర చోటుచేసుకుంది. ప్రమాదం దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. పిల్లలు బోరున ఏడుస్తూ రక్తం కారుతున్న గాయాలతో రోడ్డుపై పడి ఉండటం చూసిన వారి హృదాయాలు చలించిపోయాయి..ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలు గాయపడ్డారు.

బేతని స్కూల్ విద్యార్థులు ఈ ఉదయం ఆటోలో స్కూల్ వెళ్తున్న టైంలో ప్రమాదం జరిగింది. సంఘం శరత్ థియేటర్ సమీపంలో స్కూల్‌ పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. అంతే అటో పల్టీలు కొట్టింది. ఈ దెబ్బకు అటోలో ఉన్న విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు..ఆటో నుజ్జు నుజ్జు అయిపోయింది. ప్రమాదంలోగాయపడ్డ విద్యార్థులను స్థానికంగా ఉండే సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టిన తర్వాత లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు యత్నించారు. వారి స్థానికులు, ఆటో డ్రైవర్‌లు పట్టుకొని బంధించారు. పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉంచి వారికి అప్పగించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. రక్తపు గాయాలతో పడి ఉన్న తమ చిన్నారులను చూసుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.

డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ హైస్పీడ్‌లో లారీ దూసుకువచ్చి ఆటోను డీకొన్నట్లు పేర్కొంటున్నారు. హెవీ వెహికల్స్‌కి నిషేధం ఉన్న టైమ్‌లో సిటీలోకి లారీ రావడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..