Crime News: అనంతపురంలో మరో కీచక టీచర్.. విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన..!

అనంతపురం జిల్లాలో బొమ్మనహాళ్ మండలం శ్రీధర్ ఘట్ట ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఓ విద్యార్థినిని వేధించిన ఘటన మరువక ముందే అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లోని కోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో..

Crime News: అనంతపురంలో మరో కీచక టీచర్.. విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన..!
Crime
Follow us
Venkata Chari

|

Updated on: Feb 18, 2022 | 6:10 AM

Crime News: గురు బ్రహ్మ , గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః అని విద్యాబుద్ధులు నేర్పే గురువుకు ఆ భగవంతునితో సమానంగా సమాజంలో స్థానం కల్పించారు. కానీ, అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు(Teacher) కొందరు ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా దారి తప్పుతున్నారు. అనంతపురం(Ananthapur) జిల్లాలో బొమ్మనహాళ్ మండలం శ్రీధర్ ఘట్ట ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఓ విద్యార్థినిని వేధించిన ఘటన మరువక ముందే అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లోని కోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మరో ఉపాధ్యాయుడు (బాబు) ఏకంగా ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థినులను వేధించిన విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారం ఎవరికీ చెప్పుకోలేక తల్లిదండ్రులు ఆ కీచక టీచర్ పై డయల్ 100కు సమాచారమిచ్చారు. ఈ వ్యవహారం కొద్దిరోజులుగా జరుగుతున్నా విషయం బయటకు రాలేదు. పైగా సదరు ఉపాధ్యాయుడు జిల్లాలో కొన్ని సంఘాలకు నాయకుడిగా ఉండి ఉద్యమాలలో పాల్గొనటం వల్లనే తనపై ఎవరో ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ బుకాయించినట్టు సమాచారం.

జిల్లాలోని ఉపాధ్యాయ సంఘంలో కీలక హోదాలో ఉంటున్న ఈ టీచర్ గతంలో కూడా విద్యార్థినుల పట్ల వక్రబుద్ది చూపి తన్నులు తిన్నా బుద్ది మాత్రం మార్చుకోలేదు. ఈ విషయం మీడియాలో బయటకు రావడంతో మెడికల్ లీవ్ కాపీని స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టి బడికి రాకుండా గైర్హాజరయ్యారు. ఈ ఉపాధ్యాయుడు పుట్లూరు మండలం కడవ కల్లు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సమయం లోనూ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. అప్పట్లో పోలీసు కేసు నమోదు కావడంతో సస్పెండ్ అయ్యాడు.

ఆ కేసు నుంచి బయటపడి “కుక్క తోక వంకర అన్నట్టు” మరోసారి ఈ కీచక ఉపాధ్యాయుడు తన కీచక దుర్బుద్ధిని ప్రదర్శించాడు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు కీచక టీచర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వెంటనే సస్పెండ్ చేసి శాఖ పరమయిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.

ఎట్టకేలకు ఈ వ్యవహారం‌పై గుత్తి పోలీసులు ఆ కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Also Read: పంచలోహ విగ్రహాల పేరుతో మోసం.. ముఠా అరెస్టు.. మరో ఘటనలో

గ్యాస్ సిలిండర్ పేలి.. ఇల్లు దగ్ధం.. సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లిన నిమిషాల్లోనే ఘటన