గ్యాస్ సిలిండర్ పేలి.. ఇల్లు దగ్ధం.. సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లిన నిమిషాల్లోనే ఘటన

నిర్మల్ పట్టణం శాంతినగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. భారీ శబ్ధంతో పేలుడు జరగడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. గ్యాస్ పేలుడు..

గ్యాస్ సిలిండర్ పేలి.. ఇల్లు దగ్ధం.. సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లిన నిమిషాల్లోనే ఘటన
Cylender Blast
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 17, 2022 | 9:24 PM

నిర్మల్ పట్టణం శాంతినగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. భారీ శబ్ధంతో పేలుడు జరగడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. గ్యాస్ పేలుడు ఘటనలో మంటలు భారీగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆ ఇంటి వారు మేడారం జాతరకు వెళ్లిన నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరగింది. ప్రాణనష్టం తప్పినా.. ఆస్తి నష్టం జరిగిందని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. గ్యాస్ పేలుడు ఘటనలో ఇంట్లోని సామగ్రి, నగదు దగ్ధమయ్యాయి. రేకుల ఇల్లు కావడంతో గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని యాభై వేల రూపాయల డబ్బు, కాలి పట్టీలు, బట్టలు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు.

సమ్మక్క-సారలమ్మ జాతర కోసం కుటుంబసభ్యులతో కలిసి బయలుదేరానని.. నిర్మల్ నుంచి కొండాపూర్ వరకు వెళ్లగానే ఇల్లు కాలిపోతున్నట్టు ఫోన్ వచ్చిందని బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చే లోపే అన్నీ కాలి బూడిదయ్యాయని బోరున విలపించారు. ఉన్న గూడు పోయి, రోడ్డున పడ్డానని కన్నీటిపర్యంతమయ్యారు.

ఇవీ చదవండి.

Goat and Donkey Video: ఈ మేక చాలా తెలివైంది..! చెట్టుపై ఆకుల్ని ఎలా అందుకుందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి నక్కి నక్కి చూస్తోంది, కనిపెట్టారా.? గుర్తించగలరేమో ట్రై చేయండి..

Bappi Lahiri : అశ్రునయనాల మధ్య ముగిసిన డిస్కోకింగ్‌ బప్పీలహరి అంత్యక్రియలు..