Goat and Donkey Video: ఈ మేక చాలా తెలివైంది..! చెట్టుపై ఆకుల్ని ఎలా అందుకుందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..
కాల క్రమేనా మానవుడు తన తెలవి తేటలతో టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటున్నాడు. అయితే ఇందుకు జంతువులు కూడా తామేమీ తక్కువ కాదంటున్నాయి. పలు సందర్భాల్లో వాటి తెలివి తేటలను ప్రదర్శించి నిరూపించుకుంటున్నాయి.
కాల క్రమేనా మానవుడు తన తెలవి తేటలతో టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటున్నాడు. అయితే ఇందుకు జంతువులు కూడా తామేమీ తక్కువ కాదంటున్నాయి. పలు సందర్భాల్లో వాటి తెలివి తేటలను ప్రదర్శించి నిరూపించుకుంటున్నాయి. తాజాగా ఓ మేక తన ఆకలి తీర్చుకునేందుకు ఎంతో తెలివిగా వ్యవహరించింది. జాతి వైరం మరిచి తనలాగే ఆకులు అలములూ తింటూ జీవించే గాడిద సహాయంతో తన ఆకలి తీర్చుకుంది. ఎలాగంటే… సహజంగా మేకలు… పొలం గట్ల దగ్గరా, పచ్చిక బయళ్లలోనూ, కొండలపైనా ఆకులు, అలములు తింటాయి. కానీ ఈ మేక అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు ఆకులు తినాలనుకుంది. అయితే అవి దానికి అందడం లేదు. అప్పుడు దానికో ఐడియా వచ్చింది. వెంటనే తనతోపాటే ఉన్న గాడిద వీపుపైకి ఎక్కి ఆ చెట్టు ఆకుల్ని అందుకుని ఎంచక్కా తినేసింది. ఆ మేక ఆకులు అందుకుని తినేవరకూ ఆ గాడిద కూడా
దానికి ఎంతో సహకరించింది. ఇది కదండీ… హెల్పింగ్ నేచర్ అంటే… నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీమ్ వర్కుతో ఏదైనా సాధ్యమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటి సఖ్యతను మెచ్చుకుంటున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ: